Lakshmi Pranathi: పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా?

  • October 4, 2023 / 09:20 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ప్రముఖ బిజినెస్ అయినటువంటి నార్నే శ్రీనివాస్ కుమార్తె. ఇలా ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిల వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి అన్ సీన్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె పెళ్లికాకముందు ప్రముఖ నటుడు బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మిని పెళ్లి వేడుకలలో సందడి చేస్తున్నటువంటి ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మిని చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ కి ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసిన సంగతి మనకు తెలిసిందే .అయితే ఈ వివాహ వేడుకలలో భాగంగా లక్ష్మీ ప్రణతి పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరు ఈ ఫోటో చూసి ఆశ్చర్యపోవడమే కాకుండా ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ కి ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనకు తెలిసిందే. ఇక ఆయనకు ఆయన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు కనబడితే అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుంటారు. ఇక ఎప్పుడూ బయటకు రానటువంటి లక్ష్మీప్రణతి ఫోటోలు కనుక సోషల్ మీడియాలో కనిపిస్తే వాటిని వైరల్ చేస్తారనే విషయం మనకు తెలిసిందే. అయితే పెళ్లి కాకుండానే లక్ష్మీ ప్రణతి ఇలా బ్రాహ్మిని పెళ్లి వేడుకలలో సందడి చేయడంతో ఈ ఫోటోని చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు.

ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకున్నటువంటి (Lakshmi Pranathi) లక్ష్మీ ప్రణతి స్వయంగా చంద్రబాబు నాయుడుకి సమీప బంధువు అనే విషయం మనకు తెలిసిందే. ఇక ఈ ప్రపోజల్ కూడా చంద్రబాబు నాయుడు తీసుకువచ్చారని తెలుస్తోంది. దీంతో చంద్రబాబు నాయుడు కొడుకు వివాహ వేడుకలలో లక్ష్మీ ప్రణతి సందడి చేశారు. అయితే అప్పటికి ఇప్పటికీ ఈమెలో ఎలాంటి మార్పులు లేవని ఇప్పుడు ఎలాగా ఉందో అప్పుడు కూడా అంతే అందంగా ఉన్నారని ఈ ఫోటో చూసినటువంటి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus