‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ‘దేవర’ సినిమా షురూ చేశాడు ఎన్టీఆర్. సినిమా కథ తదితర విషయాల్లో ఏవో సమస్యలు వచ్చి సినిమా ఆలస్యమైంది. అయితే ఈ సినిమాను రెండు పార్టులు చేయడంతో వచ్చే ఏడాది కూడా ఈ సినిమా షూటింగ్, ప్రచారంలో బిజీ అవ్వనున్నాడు తారక్. మరోవైపు ఈ సినిమాతో పారలల్‌గా ఇంకో సినిమా చేయాలని అనుకున్నాడు. అదే హిందీ సినిమా ‘వార్ 2’. అయితే ఈ సినిమా పారలల్‌గా చేయడం లేదు. దీని వెనుక పెద్ద కారణమే ఉందంటున్నారు.
ఫారుఖ్ ఖాన్ – అయాన్ ముఖర్జీ కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘వార్ 2’. ఈ సినిమాలో మరో కీలక పాత్ర / ప్రముఖ పాత్ర కోసం ఎన్టీఆర్‌ను సంప్రదించడం, ఓకే చేయడం జరిగిపోయాయి. ముంబయి సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైపోయింది. కానీ ఇంతవరకు తారక్ ఇంకా షూటింగ్లో పాల్గొనలేదు. దీంతో తారక్ డూప్‌ను పెట్టి సినిమా చేసేస్తున్నారు అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.
అయితే, ఇప్పటివరకు ‘వార్ 2’ సినిమా షూటింగ్ పూర్తి స్థాయిలో మొదలవ్వలేదని, త్వరలో షూటింగ్ ఉంటుందని చెబుతున్నారు. తొలుత ఈ సినిమా షెడ్యూల్స్‌లో యాక్షన్ సన్నివేశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారట. అవన్నీ ‘వార్’ సినిమా తరహాలోనే విదేశాల్లో ఉంటాయి అని చెబుతున్నారు. దీని కోసం హృతిక్, తారక్ కొన్ని నెలల పాటు విదేశాల్లోనూ ఉండాల్సి వస్తుందని చెబుతున్నారు. ఈ కారణంగానే ‘దేవర’ పనులు అయ్యేంతవరకు (Jr NTR) తారక్ ‘వార్ 2’ సెట్స్‌కి వెళ్లకుండా చూసుకున్నాడని చెబుతున్నారు.
ప్రస్తుతం దర్శకుడు అయాన్ ముఖర్జీ లొకేషన్స్ రెక్కీ నిర్వహిస్తున్నాడట. అంతా ఓకే అనుకున్నాక హృతిక్, తారక్ అండ్ టీమ్స్ మొత్తం విదేశాలకు వెళ్లి యాక్షన్ సీన్స్ చేసుకుని వచ్చేస్తారట. ఆ తర్వాత ముంబయి, హైదరాబాద్‌లోని స్టూడియోల్లో సెట్స్ వేసి సినిమా పనులు పూర్తి చేస్తారు అని చెబుతున్నారు. అదెప్పుడు అనేది త్వరలోనే చెబుతారట.