Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర1 పూర్తయ్యేది అప్పుడేనా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. డిసెంబర్ నెల చివరి వారం సమయానికి ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుందని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ఔట్ పుట్ విషయంలో సంతృప్తితో ఉన్నారని సమాచారం అందుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్2 సినిమాకు సంబంధించి కూడా షాకింగ్ అప్ డేట్స్ వచ్చాయి. ఎన్టీఆర్ 2024 సంవత్సరంలో ఒకవైపు వార్2 సినిమాలో నటిస్తూనే మరోవైపు ప్రశాంత్ నీల్ సినిమాలో నటిస్తారని సమాచారం అందుతోంది.

ఈ రెండు సినిమాలు స్పెషల్ గా ఉండబోతున్నాయని తెలుస్తోంది. యంగ్ టైగర్ (Devara) దేవర1 కు గుమ్మడికాయ కొట్టేది డిసెంబర్ లోనే అని తెలిసి ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. యంగ్ టైగర్ బాలీవుడ్ డైరెక్టర్లకు సైతం ప్రాధాన్యత ఇస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాస్ మసాలా స్క్రిప్ట్ లతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సినిమాల కోసం తారక్ పడుతున్న కష్టం అంతాఇంతా కాదు.

క్లిష్టమైన సన్నివేశాల్లో సైతం తారక్ డూప్ లేకుండా నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చాలామంది దర్శకుల ఫేవరెట్ హీరోగా మారిపోవడం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోగా అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. స్లిమ్ లుక్ లో తారక్ ప్రేక్షకులను మరింత మెప్పించేలా కనిపిస్తున్నారు.

తారక్ కు 2024 కెరీర్ పరంగా మరింత కలిసిరావాలని అభిమానులు ఫీలవుతున్నారు. వార్2 సినిమాలో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో మరిన్ని బాలీవుడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus