Jwala Gutta: విష్ణు విశాల్ ని పెళ్లి చేసుకోవడానికి కారణమదే..!

  • February 7, 2022 / 02:02 PM IST

‘రాక్షసన్’ సినిమాతో నటుడిగా తన రేంజ్ పెంచుకున్నాడు హీరో విష్ణు విశాల్. అంతకుముందు కూడా ఆయన ఎన్నో విభిన్న చిత్రాల్లో నటించాడు. కోలీవుడ్ లో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రెస్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘ఎఫ్ఐఆర్’ సినిమాను మను ఆనంద్ డైరెక్ట్ చేశారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. రవితేజ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

Click Here To Watch

ఫిబ్రవరి 11న సినిమా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ కి సిద్ధు జొన్నలగడ్డ, సందీప్ కిషన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో గుత్తా జ్వాలా మాట్లాడిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. ‘నన్ను సినిమాల్లో ఎప్పుడు నటిస్తారని అందరూ అడుగుతుంటారు కదా.. అందుకే ఓ హీరోని పెళ్లి చేసుకున్నాను’ అంటూ విష్ణు విశాల్ ని చూపిస్తూ నవ్వింది గుత్తా జ్వాలా.

ఇది చాలా మంది సినిమా అని.. తెలుగులో రిలీజ్ చేయాలని తనే అడిగినట్లు చెప్పింది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను కచ్చితంగా చూడాలని అన్నానని.. రవితేజ గారు సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్స్ అని చెప్పింది. ఈ సినిమాను చూడండి అని అడగడం లేదని.. బెదిరిస్తున్నాను అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విష్ణు విశాల్ 2010లో రజిని నటరాజ్ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు.

వీరికో బిడ్డ కూడా ఉంది. కానీ 2018లో ఈ జంట విడాకులు తీసుకుంది. ఆ తరువాత 2021లో గుత్తా జ్వాలాను రెండో పెళ్లి చేసుకున్నారు విష్ణు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus