దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు హీరోగా నటిస్తున్నాడు… అందులో నలుగురు హీరోయిన్లు అంటూ చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. దీనిపై ఎవరూ అధికారికంగా స్పందించలేదు. దీంతో ఇది పుకారుగా మాత్రమే నిలిచిపోతుందని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఇది నిజం అంటూ తనికెళ్ల భరణి ముచ్చటైన బాంబు పేల్చారు. అంతేకాదు పనులు జరుగుతున్నాయని, త్వరలో సినిమా మొదలుపెడతామని కూడా చెప్పారు. అసలు ఆ సినిమా ఆలోచన ఎలా పుట్టింది అనే విషయం కూడా చెప్పేశారు.
‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ‘మిథునం’కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. నేను ఇంకో సినిమా తీస్తున్నానంటే అది గొప్పగానే ఉండాలి కదా. దీనికి నా అసిస్టెంట్ మహర్షినే కారణం. ఓసారి మహర్షి నా దగ్గరికి ఓ కథ తీసుకొచ్చాడు. ఇందులో రాఘవేంద్రరావు హీరో అన్నాడు. ఈ కథను రాఘవేంద్రరావు గారికి చెప్పాలనుకుంటున్నాను అని అన్నాడు. ‘ఏమయ్యా.. ఆయన సినీ ముని.. మాటైనా మాట్లాడడు.. ఏదో ‘సౌందర్యలహరి’ చేశాడు కానీ, నటన అంటే ఒప్పుకోడు’ అన్నాను. కానీ మహర్షి ప్రయత్నిస్తా అన్నాడు’’ అంటూ కథ తన దగ్గరకొచ్చిన విషయం చెప్పాడు.
‘‘తీరా రాఘవేంద్రరావు ఆ కథ వినలేదు. తిరిగొచ్చి నాకు కథ చెప్పాడు. బాగుంది.. చాలా కొత్త కథ అన్నాను. తీయకపోయినా సరే ఒకసారి కథ వినండి గురువు గారు అని రాఘవేంద్రరావుకి ఫోన్ చేసి అడిగా. విన్నాక ఆయనకూ నచ్చింది. ఎవరు డైరెక్టర్ అని మహర్షిని అడిగితే నా పేరు చెప్పాడట. ఆ విషయం నాకు తెలియదు. వెంటనే రాఘవేంద్రావు ఒప్పేసుకున్నారు. అదే విషయం నాకు చెప్తే నేను డైరెక్ట్ చేయడం ఏంటయ్యా అన్నాను. లేదు… మీరే చేయాలి అని పట్టుబట్టాడు. అలా ఆ సినిమా కుదిరింది. పూర్వ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అంటూ ఇంట్రెస్టింగ్ సినిమా గురించి చెప్పుకొచ్చారు తనికెళ్ల భరణి.
Most Recommended Video
2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!