ఆ హీరోయిన్ పై కాలా దెబ్బ!

సినిమారంగంలో లక్కు ఉండాలి అంటారు. చిత్ర పరిశ్రమ లాటరీ వంటిది అంటుంటారు. ఒక్కొక్కరిది ఒక్కోఅభిప్రాయం. అవును పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు కూడా ఫిలిం ఇండస్ట్రీ అంతుపట్టదు. వినియోగదారులకు (ప్రేక్షకులకు) ఎటువంటి కథ నచ్చుతుందో.. ఎలా తీస్తే నచ్చుతుందో వందశాతం సరిగ్గా చెప్పలేము. సూపర్ హిట్ అవుతుందని అనుకున్న సినిమాలు రెండో రోజే థియేటర్ల నుంచి వెనక్కి వెళ్లిన  సందర్భాలున్నాయి. అలా భారీ అంచనాలతో వచ్చి ఫెయిల్ అయిన సినిమాల ప్రభావం ఆ చిత్ర టెక్నీషియన్స్, ఆర్టిస్టులపై పడుతుంది. ఆ దెబ్బ ఎలా ఉంటుందో తాజాగా హుమా ఖురేషికి తెలిసివచ్చింది. రజినీకాంత్ సినిమాలో ఆమెకి అవకాశం రాగానే ఆనందపడింది. ఇక తాను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదనుకుంది.

అందుకు తగ్గట్టే భారీ అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్ దర్శకనిర్మాతలు కూడా ఆమెకు  కోటి యాభై లక్షలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అయితే పా రంజిత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కాలా ఆశించినంత విజయం సాధించలేదు. సో హుమా ఖురేషి ని సంప్రదించిన వారంతా మొహం చాటేశారు.   కోటి యాభై లక్షలు ఇస్తామన్న వారు కూడా సగానికి తగ్గించేశారు. దాంతో ఆమె ఆ ప్రాజక్ట్ ని ఓకే చేయాలా? వద్దా ? అని ఆలోచిస్తోంది. ఒక అపజయం ఇంత మార్పు తీసుకొస్తుందా? అని ఆమె షాక్ లో ఉంది. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమాలో నటిస్తోంది. రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవికి థియేటర్లో రానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై  భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus