Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

దుల్కర్‌ సల్మాన్‌,భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో రానా దగ్గుబాటి, సముద్రఖని అత్యంత కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘కాంత’.సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి సమర్పణలో దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మించారు.

Kaantha Collections

ఫస్ట్ లుక్ పోస్టర్స్ నుండి టీజర్, ట్రైలర్స్ వంటి ప్రమోషనల్ కంటెంట్ అంతా ఓ పాత సినిమాని పోలి ఉండటం వల్ల ‘కాంత’ పై బజ్ ఏర్పడలేదు. దానికి తోడు సినిమాకి మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ దుల్కర్ సల్మాన్ కి ఉన్న క్రేజ్ కారణంగా మొదటి రోజు వసూళ్లు పర్వాలేదు అనిపించాయి.

ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.40 cr
సీడెడ్ 0.05 cr
ఆంధ్ర(టోటల్) 0.48 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 0.93 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.11 cr
ఓవర్సీస్ 0.10 cr
టోటల్ వరల్డ్ వైడ్ 1.14 కోట్లు(షేర్)

‘కాంత'(Kaantha) (తెలుగు వెర్షన్) సినిమాకు రూ.5.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫస్ట్ డే ఈ సినిమా రూ.1.14 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.4.86 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్ అంతా ఇదే జోరు చూపిస్తే.. వీక్ డేస్ పై భారం తగ్గి బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

512 CE టు 2027 CE వయా 7200 BCE త్రేతాయుగం!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus