కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Advertisement

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీకి తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ఉంది. అతన్ని టాలీవుడ్ హీరోలానే ట్రీట్ చేస్తారు తెలుగు ప్రేక్షకులు. అతని సినిమాలు చాలా వరకు తెలుగులో కూడా ఘనవిజయం సాధించాయి. వాటి లిస్టులో ‘ఆవారా'(తమిళంలో ‘పయ్యా’)(Paiyaa) కూడా ఉంది. లింగుస్వామి ఈ చిత్రానికి దర్శకుడు. 2010 లో రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి.

Paiyaa

‘అరెరె వాన’ సాంగ్ అయితే చార్ట్ బస్టర్ అయ్యింది. ఇందులో కథ ఏమీ కొత్తగా ఉండదు. కానీ స్క్రీన్ ప్లే మాత్రం ఆకట్టుకునే విధంగా డిజైన్ చేశాడు దర్శకుడు లింగుస్వామి.

‘ఆవారా’ సినిమా ఓ క్లాసిక్. అయితే ఈ సినిమాని ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ మిస్ చేసుకున్నారు అనే సంగతి చాలా మందికి తెలిసుండకపోవచ్చు. ఆ టాలీవుడ్ స్టార్స్ మరెవరో కాదు. ఒకరు మహేష్ బాబు, ఇంకొకరు రామ్ చరణ్. ‘పోకిరి’ తర్వాత మహేష్ బాబుకి ‘అవారా’ కథని వినిపించారు లింగుస్వామి.

మహేష్ బాబుకి కథ నచ్చింది. అతని సోదరి మంజుల ఈ ప్రాజెక్టుని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. అయితే ఎప్పుడైతే ‘అతిథి’ విడుదలై డిజాస్టర్ అయ్యిందో.. అప్పుడు మహేష్ బాబు తన ప్లానింగ్ మొత్తం మార్చుకున్నారు. ఇందులో భాగంగా ‘ఆవారా’ స్క్రిప్ట్ ను కూడా రిజెక్ట్ చేశాడు మహేష్. దీంతో లింగుస్వామి అదే కథతో రామ్ చరణ్ ని అప్రోచ్ అయ్యాడు. కానీ ‘మగధీర’ తో బిజీగా ఉండటం వల్ల… చరణ్ కూడా ‘అవారా’ కథని రిజెక్ట్ చేశాడు.

ఫైనల్ గా ఆ కథని కార్తీ చేయడం.. సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అతని మార్కెట్ పెరగడం జరిగింది. ‘అవారా’ కి కార్తీ కూడా పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించుకున్నాడు.

‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus