కాష్మోరా

  • October 28, 2016 / 09:47 AM IST

ఇప్పటివరకు అల్లరి కుర్రోడు, యూత్, లవర్ బాయ్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించిన తమిళ హీరో కార్తి… తొలిసారిగా ఓ చారిత్రాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గోకుల్ దర్శకత్వంలో కార్తి, నయనతార, శ్రీదివ్య ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘కాష్మోరా’. ఇందులో కార్తి రెండు విభిన్న పాత్రలలో నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పోస్టర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. పి.వి.పి. సినిమా, డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకాలపై పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కెవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్స్ విడుదలైన క్షణం నుంచి ‘బాహుబలి’ తరహాలోనే ‘కాష్మోరా’ ఉండబోతుందని వార్తలొస్తున్నాయి. కానీ బాహుబలికి కాష్మోరాకు ఎలాంటి సంబంధం లేదని చిత్ర యూనిట్ చాలా గట్టి నమ్మకంతో చెబుతున్నారు. మరి ఈ సినిమా ఎలా వుందో, ప్రేక్షకులను ఎలా అలరించనుందో ఒకసారి చూద్దామా!

కథ : ‘కాష్మోరా’ చిత్ర కథ ఏడు తరాలకు సంబంధించిన కథాంశంతో ప్రారంభమవుతుంది. దెయ్యాలతో మాట్లాడి, వాటిని బంధించగల వ్యక్తి కాష్మోరా (కార్తి). ఓ పెద్ద పొలిటీషియన్ ను మోసం చేసి, అతని డబ్బుతో పారిపోతాడు కాష్మోరా. దెయ్యలపైన రీసర్చ్ చేసే స్టూడెంట్ శ్రీదివ్య. అయితే కాష్మోరా చివరకు ఓ పాడుబడ్డ భవంతికి చేరుకుంటాడు. ఆ బంగ్లాలో కాష్మోరాకు నిజంగానే దెయ్యాలు కనిపిస్తాయి. దీంతో కాష్మోరాకు తన గతం గుర్తుకొస్తుంది. అసలు నిజంగా కాష్మోరాకు దెయ్యలతో సంబంధం ఏంటి? కాష్మోరాకు ఆ బంగ్లాకు ఉన్న సంబంధం ఏంటి? గతంలో కాష్మోరా ఎవరు? గతంలో ఏం జరిగింది? ఇంతకీ రాజ్ నాయక్ ఎవరు? శ్రీదివ్య ఎవరు? చివరకు కాష్మోరా ఏం తెలుసుకున్నాడు? అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? చివరకు ఏం జరిగింది అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల పనితీరు : ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కార్తి. రెండు విభిన్న పాత్రల్లో కార్తి అద్భుతంగా నటించాడు. కాష్మోరా పాత్రలో సీరియస్ గా కనిపిస్తూనే తనదైన కామెడి టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. కాష్మోరా గెటప్ లో చాలా స్టైలిష్ మాసివ్ గా కనిపించాడు. అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే రాజ్ నాయక్ పాత్రలో భీభత్సం అని చెప్పుకోవాలి. ఒక విలనిజానికి ఉండాల్సిన లక్షణాలను అధ్బుతంగా పండించాడు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలలో దుమ్మురేపాడు. సినిమా అంతా కూడా తన భుజాలపై వేసుకొని నడిపించేసాడు. ఇక దెయ్యాలపై రీసర్చ్ చేసే అమ్మాయిగా శ్రీదివ్య చాలా చక్కగా చేసింది. ఇక కార్తి తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర రత్నమహాదేవి. రత్నమహాదేవి పాత్రలో నయనతార అద్బుతమైన నటనను ప్రదర్శించింది. సినిమాకు నయనతార గ్లామర్ బాగా హెల్ప్ అయ్యింది. గ్రాండ్ లుక్ లో రత్నమహాదేవి మెప్పించింది. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు బాగా చేసారు. ఫస్ట్ హాఫ్ సరదసరదాగా సాగుతూనే ఓ థ్రిల్లింగ్ ను క్రియేట్ చేస్తూ ఉంటుంది. చూస్తున్నంతసేపు ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో రాజ్ నాయక్ ఎంట్రీతో సినిమాకు హైప్ పెరుగుతుంది. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ లో కామెడి తగ్గి, యాక్షన్ ఎపిసోడ్స్ బాగా ఎక్కువ అయిపోతాయి. మొత్తానికి ‘కాష్మోరా’ సినిమా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు.

సాంకేతికవర్గం పనితీరు : ‘కాష్మోరా’కు గ్రాఫిక్స్ వర్క్ మేజర్ ప్లస్ అయ్యింది. సినిమాను గ్రాఫిక్స్ సాయంతో చాలా గ్రాండ్ గా రూపొందించారు. ఇక కథ, దర్శకత్వం అంశాలను డీల్ చేసిన గోకుల్ సక్సెస్ అయ్యాడు. మంచి స్టొరీ లైన్ ను అధ్బుతంగా ప్రజెంట్ చేసారు. స్క్రీన్ ప్లే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు. సినిమాటోగ్రఫీ సూపర్బ్. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. సంతోష్ నారాయణన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ బాగోలేదు. సెకండ్ హాఫ్ లో ఓ పది నిమిషాలు ఎడిట్ చేసి వుంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను చాలా గ్రాండ్ గా రూపొందించారు.

విశ్లేషణ : ‘కాష్మోరా’ పూర్తిగా కమర్షియల్ వాల్యూస్ ఉన్న సినిమా. కామెడి, హార్రర్, థ్రిల్లర్ గా రూపొందిన ‘కాష్మోరా’ అందరిని అలరించగల చిత్రం.

రేటింగ్ : 2.5/5

Click Here For English Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus