రజనీని వాడుకుంటూ మహేష్ ను ఆడుకుంటాడా..? 

కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా లారెన్స్ చిత్రాలకి మంచి క్రేజ్ ఉంటుందనే సంగతి తెలిసిందే . అందులోనూ ‘ముని’ సీక్వెల్స్ గా వచ్చే చిత్రాలకి మరింత క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే ‘ముని’ ‘కాంచన’ (ముని 2) ‘గంగ’ (ముని 3) చిత్రాలు మంచి విజయాన్నే అందుకున్నాయి. హారర్ కామెడీ కధాంశాలతో రూపొందించిన ఈ చిత్రాలు రెండు భాషల్లోనూ మంచి కలెక్షన్స్ సాధించాయి. ఇక సాటిలైట్ రైట్స్ కూడా మంచి రేటుకు అమ్ముడుపోగా.. టీవీలో ప్రసారం చేసిన ప్రతిసారి మంచి రేటింగ్స్ ను సాధిస్తున్నాయి. ఇక ‘ముని 4’ చిత్రం కూడా ఈ డిసెంబర్ లో రావాల్సి ఉండగా కొన్ని కారణాలవలన వాయిదా పడింది.

ఇళయ దళపతి విజయ్, సూపర్ స్టార్ రజనీ కాంత్ లతో చిత్రాలను తెరకెక్కిస్తున్న ‘సన్ పిక్చర్స్ ‘ నిర్మాణ సంస్థతో కలిసి లారెన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడట. ఈ సీక్వెల్ కి కూడా తమన్ సంగీతమందిస్తున్నాడని తెలుస్తోంది. ఇక లారెన్స్ సరసన హీరోయిన్లుగా ఓవియా .. వేదిక నటిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ సంస్థలలో ఒకటైన ‘సన్ పిక్చర్స్’ సంస్ధ ప్రకటించింది.

ఇక మరో విశేషమేమిటంటే.. తమిళ్ లో సంక్రాంతికి విడుదల కాబోతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ‘పెట్టా’ సినిమా ఇంటర్వెల్ టైంలో ‘కాంచన 3’ మోషన్ పోస్టర్ ను ప్రదర్శించేలా కూడా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ‘గంగ'(ముని 3) చిత్రాన్ని 2015 సమ్మర్ లో విడుదల చేసి భయపెట్టాడు లారెన్స్. మళ్ళీ 2019 సమ్మర్లో లారెన్స్ మళ్ళీ భయపెట్టడానికి రెడీ అవుతున్నాడు. అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ 25 వ చిత్రం ‘మహర్షి’ కూడా ఉగాది కానుకగా 2019 ఏప్రిల్ 5 న విడుదల కాబోతుంది. ‘ముని 4’ చిత్రానికి కూడా మంచి క్రేజ్ ఉండడంతో… ఈ చిత్రం ‘మహర్షి’ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ చూపే అవకాశం కూడా లేకపోలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus