Pavala Syamala: కదలలేని స్థితిలో పావలా శ్యామల!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నటువంటి వారిలో పావలా శ్యామల ఒకరు ఇలా ఒకానొక సమయంలో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమెకు ప్రస్తుతం వయసు పైబడటంతో సినిమాలలో అవకాశాలు రాలేదు తద్వారా సంపాదించినది మొత్తం తన కూతురు అనారోగ్యానికి చికిత్స చేయించడానికి ఖర్చు చేశారు ప్రస్తుతం ఈమె చేతిలో చిల్లి గవ్వ లేకుండా చాలా ఇబ్బందులను పడుతున్నారు.

ఒకవైపు వయసు పై పడటంతో అవకాశాలు లేక ఇబ్బంది పడడమే కాకుండా మరోవైపు మంచాన పడిన కూతురు కూడా ఉండటంతో ఆమె మందుల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇలా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు తనని చుట్టుముడుతున్నటువంటి తరుణంలో ఎవరైనా దాతల సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే గతంలో మెగాస్టార్ చిరంజీవి దాదాపు రెండు లక్షల రూపాయల వరకు ఈమెకు ఆర్థిక సహాయం చేశారు.

ఇకపోతే ఈమె (Pavala Syamala) పరిస్థితి ఏమాత్రం కూడా మరింత దయనీయంగా ఉంది. మంచం దిగలేని పరిస్థితికి చేరుకున్నారు. దీంతో ఈమె మరిన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈమెకు నటుడు కాదంబరి కిరణ్ 25వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈయన నటుడిగా మాత్రమే కాకుండా మనం సైతం అనే ఫౌండేషన్ నిర్వాహకులుగా కూడా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

హైదరాబాద్ శివారులో ఒక వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి ఈమెను వెతుక్కుంటూ మరి వెళ్లి తనకు 25వేల రూపాయల చెక్కు అందజేశారు. ఇక ఈయన నడిపిస్తున్నటువంటి మనం సైతం అనే ఫౌండేషన్ సినీ ఇండస్ట్రీలో పేద కార్మికులకు సహాయం చేయడానికి నిర్మించారు. ఈ ఫౌండేషన్ గత పది సంవత్సరాలగా ఎంత విజయవంతంగా కొనసాగుతుంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus