టాలీవుడ్ అన్న పదం ఏర్పడిన తొలి దశకంలో టాప్ హీరోలతో పాటు నటించిన విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ. అయితే అప్పటి తరాన్ని, ఇప్పటి తరాన్ని చూసిన మన సత్తిబాబు నేటి తరం హీరోలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విషయం ఏమిటంటే…తాజా హీరోల లుక్స్ పై, వారి యొక్క బాడీ ల్యాంగ్వేజ్ పై మాట్లాడిన సత్తిబాబు…నేటి తరం హీరోలు అసలు హీరోలే కాదు అన్నట్లుగా గాలి తీసేసారు….అంతేకాకుండా కండలు ఉంటేనే హీరో కాదు అని, అదే క్రమంలో కండలు ఉన్నవాడే హీరో అని అనుకుంటున్నారు నేటి హీరోలు, అందుకే సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ అంటూ బాడీ పెంచుతూ సినిమాలు చేస్తున్నారు.
ఇక లుక్స్ విషయంలోకుడా మన సీనియర్ యాక్టర్ హీరోలపై విరుచుకు పడ్డారు…నేటితరం హీరోలు గడ్డాలు పెంచుకుని ఎంత రఫ్ గా కనిపిస్తే అంత గొప్ప హీరో అనుకుంటున్నారని కేవలం గడ్డాలు పెంచుకుని కండలు పెంచుకుంటే టాప్ హీరోలు అవ్వలేరని ఆయన విమర్శించారు. అంతటితో ఆగకుండా నేటి తరం నటీనటులు, వారి బిహేవియర్ గురించి సైతం మన సత్తిబాబు విమర్శలు చేశారు…ఈ తరంవారు తాను కనిపిస్తే కనీసం విష్ కూడా చెయ్యరని, ఇక తాను చేద్దాం అని అనుకున్నా పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళిపోతారని తెలిపారు.
ఇక అప్పటి తరం హీరోలకి, ఇప్పటి తరం హీరోలకి మధ్య తేడా చెబుతూ..తనతరం టాప్ హీరోలు ఎన్టీఆర్, అక్కినేని లు కేవలం డబ్బు కోసమే నటించ లేదని ఒక పాత్ర చేయాలి జనాల హృదయాలలో స్థానం సంపాదించాలి అన్న భావనతో సినిమాలు చేశారని ఇప్పుడు డబ్బే సర్వస్వం అయిపోయిందని అంటూ వ్యాఖ్యాలు చేసారు సత్యనారాయణ. ఇలా తనలోని బాధని, భావాన్ని అనుకోకుండా బయటపెట్టారు మన కైకాల సత్యనారాయణ గారు.