కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంది.. కంగారెందుకు?

ఈ హీరోయిన్స్ ను అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. కెరీర్ మొదలెట్టిన హీరోయిన్ను “ఏ హీరోతో రొమాన్స్ చేయాలనుంది?” అని అడిగితే.. ఒక పదిపదిహేను సినిమాలు చేసిన హీరోయిన్నేమో “ఎలా సెటిల్ అవ్వాలనుకొంటున్నారు?, ఎప్పుడు పెళ్లి చేసుకొంటారు? ఎవర్ని పెళ్లి చేసుకొంటారు?” అనే రొటీన్ క్వశ్చన్స్ అడిగి ఇబ్బందిపెడుతుంటారు. కొంతమంది హీరోయిన్స్ ఇలాంటి క్వశ్చన్స్ కి అలవాటుపడిపోయి “ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు” అంటూ సింపుల్ ఆన్సర్ తో సరిపెట్టేస్తే.. కొందరు హీరోయిన్స్ మాత్రం “ఇప్పుడు అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలా?, నా పెళ్లి గురించి మీకు కంగారెందుకు?” అని రివర్స్ లో మీడియాను క్వశ్చన్ చేస్తుంటారు.

రీసెంట్ గా క్రేజీ గాళ్ కాజల్ ను కూడా ముంబై మీడియా “పెళ్ళెప్పుడు, ఎవరితో?” అనే క్వశ్చన్ అడిగారాట. కాజల్ మాంచి క్లాస్ హీరోయిన్ కావడంతో ఎప్పుడు అడిగే రొటీన్ క్వశ్చన్ కి కూడా చాలా సెటిల్డ్ గా “నా కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజ్ లో ఉంది, ఇప్పుడు పెళ్లి చేసుకొని కెరీర్ ను పాడుచేసుకోలేను, సో కొన్నాళ్లపాటు సినిమాలు చేసుకోనివ్వండి. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకొంటే అప్పుడు మీకు తప్పకుండా చెప్పే చేసుకొంటాను” అంటూ సమాధానం చెప్పింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus