అప్పుడు అంతే..ఇప్పుడు అంతే : కాజల్ అగర్వాల్

  • November 12, 2017 / 06:32 AM IST

బాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ .. అనేక మంచి పాత్రలు పోషించి టాలీవుడ్ యువరాణిగా పేరుతెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ స్టార్ హీరోల సరసన నటిస్తూ విజయాలను అందుకుంది. ప్రస్తుతంలో తమిళంలో అజయ్ సరసన, తెలుగులో కళ్యాణ్ రామ్ కి జోడీగా  ‘ఎమ్‌.ఎల్‌.ఎ’లో నటిస్తోంది. ఆమె రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో అనేక ఆసక్తికర సంగతులు చెప్పింది. చిత్ర సీమలోకి అడుగుపెట్టి పదేళ్లు అవుతున్నా తన క్యారక్టర్  సెలక్షన్ లో మార్పు రాలేదని వెల్లడించింది.

‘‘ నేను కోరుకొన్నానని ఏ పాత్రా నా దగ్గరికి రాదు. న్యాయం చేయగలిగే సత్తా నాకుందనే నమ్మకం కలిగినప్పుడే దర్శకులు నన్ను సంప్రదిస్తారు. నేను నా పాత్రలకు న్యాయం చేశాను కాబట్టి.. ఇప్పుడు దర్శకులు నాకు సూట్ అయ్యే పాత్రలు సృష్టిస్తున్నారు. అంతే తప్ప… కథలు, పాత్రల ఎంపికలో నా ధోరణిని మాత్రం మార్చుకోలేదు. తొలినాళ్లల్లో నా మనసు చెప్పినట్టే విన్నా, ఇప్పుడూ అంతే. మనసు చెప్పింది ఎప్పుడూ సరైనదే’’ అని కాజల్ వెల్లడించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus