చిరంజీవికి కాజల్ ఎఫెక్ట్!

Advertisement

ఎన్నో అంచనాల మధ్య రిలీజైన జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎదో చెప్పాలి కాబట్టి పర్లేదు అంటున్నారు. మొత్తానికి గ్యారేజ్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఆ విషయం పక్కనబెడితే గ్యారేజ్‌ను ఎలాగైనా హిట్ చేయ్యాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకి కొన్ని ఇన్‌గ్రిడియన్స్ యాడ్ చేశారు. అందులో ఒకటి కాజల్ ఐటెం సాంగ్. సినిమాకి ప్లస్ అవుతుందనో..స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందనో అనుకున్న కాజల్ ఈ విషయంలో ఏ మాత్రం న్యాయం చేయలేకపోయిందట. ఏజ్ బార్ అయిపోవడంతో ఫేస్‌లో మనుపటి ఛార్మింగ్ లేదు…కనీసం స్టెప్పులైనా పర్లేదా అంటే… స్టేజ్‌ మీద కదల్లేక కదల్లేక కదిలింది.

అసలే మనమ్మడు డ్యాన్సుల్లో వీక్. ఏదో నెట్టుకురావాలి కాబట్టి నెట్టుకోస్తోంది. అలాంటి కాజల్ తన పూర్ పర్ఫామెన్స్‌తో ఐటెం సాంగ్‌లో నిజంగానే ఐటెంగా మిగిలిపోయింది. ఈ మాత్రం సంబరానికి దాదాపు కోటి రూపాయలకు పైగా ముట్టజెప్పారట నిర్మాతలు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ అభిమానులను నిరాశపరిచింది కాకుండా కాజల్ మెగా అభిమానుల్లో లేటెస్ట్‌గా టెన్షన్ రేపుతోంది. చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇస్తున్న ఖైదీ నెం.150 సినిమాలో కాజల్, చిరుతో జతకట్టింది. అసలే డ్యాన్సులకి..అదిరిపోయే స్టెప్పులకి చిరు కేరాఫ్. అలాంటిది మెగాస్టార్ పక్కన కూడా కాజల్ ఇలాంటి పర్మామెన్సే రీపిట్ చేస్తే చిరు ఎంత కష్టపడితే మాత్రం ఏం లాభం. 150వ సినిమా హిట్టయ్యి చిరంజీవికి పూర్వ వైభవం రావాలని మెగా ఫ్యాన్స్ ఆశ పడుతున్న వేళ కాజల్‌ ఎఫెక్ట్ చిరంజీవిని ఏం చేస్తుందోనని వారు భయపడిపోతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus