కాజల్ కొత్త ఇంటి ఏర్పాట్లు!

  • October 22, 2020 / 02:04 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ముంబైకి చెందిన ఇంటీరియర్ డిజైనర్‌, ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ కిచ్లును ఈ నెల 30న కాజల్ వివాహం చేసుకోబోతున్నారు. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. ఇటీవలే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది కాజల్. కరోనా నేపథ్యంలో ఈ పెళ్లిని సింపుల్‌గా ఇంట్లోనే చేసుకుంటున్నారట. ఇరు వర్గాల కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులను మాత్రమే ఈ పెళ్లికి ఆహ్వానించనున్నారు.

40 నుంచి 50 మంది వరకు ఈ పెళ్లికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. పెళ్లి ఏర్పాట్లలో పాటు పెళ్లి తరువాత ఉండబోయే ఇంటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. కాజల్ ని వివాహం చేసుకుంటున్న గౌతమ్ ఇంటీరియర్ బిజినెస్ కి సంబంధించిన కంపెనీను రన్ చేస్తున్నారు. ఇప్పటికే సొంత ఇంటిని కొనేసుకున్న కాజల్ అండ్ గౌతమ్.. ఆ ఇంట్లోని ఇంటీరియర్ డిజైన్ ని తమకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకుంటున్నారు.

ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది కాజల్. కొత్త ఇంట్లో జరుగుతున్న వర్క్ కి సంబంధించిన ఓ ఫోటో షేర్ చేసిన కాజల్.. ”‘మా కొత్త ఇంటిని సర్దుకుంటున్నాం.. ఏమైనా సలహాలు ఇవ్వగలరా..?” అంటూ అభిమానులను అడిగారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కాజల్ ‘ఆచార్య’, ‘ఇండియన్ 2’, ‘మోసగాళ్లు’ లాంటి చిత్రాల్లో నటిస్తోంది.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus