అంత డబ్బు సంపాదిస్తే కాజల్ ప్లాన్ ఇదే!

  • March 18, 2021 / 12:01 PM IST

కోట్ల రూపాయల ఆస్తులు వస్తే ఎవరైనా కూడా విలాసవంతమైన బంగ్లాలు, లగ్జరీ కార్లు కొనుక్కుంటారు. కొత్త బిజినెస్ లు మొదలుపెడతారు. కానీ కాజల్ మాత్రం అలా చేయదట. తనకు నిజంగానే కోట్ల రూపాయల ఆస్తులు వస్తే అందరికీ కరోనా వాక్సిన్ ఇప్పిస్తానని చెప్పి తన మంచితనం చాటుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘మోసగాళ్ళు’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకోవడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

కాజల్ కూడా ఈ సినిమాపై నమ్మకం పెట్టుకుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది. ఈ సినిమా కథ 2600 కోట్ల రూపాయల కుంభకోణం చుట్టూ తిరుగుతుంది. అంత డబ్బు నిజ జీవితంలో దొరికితే ఏం చేస్తారని.. ఓ ఇంటర్వ్యూలో కాజల్ ని ప్రశ్నించగా.. దానికి ఆమె తడుముకోకుండా బదులిచ్చింది. ఆ డబ్బుతో ముందుగా అందరికీ కరోనా వాక్సిన్ ఇప్పిస్తానని.. దాని వలన ప్రపంచం కుదుటపడుతుందని.. ఎవరి పనులు వాళ్లు చేసుకోవచ్చని చెప్పింది.

ఇదేదో మిస్ వరల్డ్ పోటీల్లో చెప్పేలాంటి సమాధానం కాదని.. నా మనసుకి అనిపించింది చెబుతున్నా అంటూ వెల్లడించింది. కాజల్ చెప్పిన ఈ సమాధానం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. దాదాపు పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న కాజల్.. ఇప్పటికీ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోంది. అలానే రీసెంట్ గా నాగార్జునతో కలిసి ఓ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus