స్టార్ హీరోయిన్ కాజల్ (Kajal) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘చందమామ’ సినిమాతో క్రేజీ హీరోయిన్ అయ్యింది. ‘మగధీర’ తో అయితే స్టార్ హీరోయిన్ గా అవతరించింది. అటు తర్వాత కాజల్ చేసిన సినిమాల్లో చాలా వరకు సూపర్ హిట్ అయ్యాయి. అందువల్ల ఆమె రేంజ్ పెరుగుతూ వచ్చింది. దాదాపు 10 ఏళ్లకు పైగా ఈమె స్టార్ హీరోయిన్ గా రాణించింది. అయితే కోవిడ్ టైంలో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం, ఆ తర్వాత ఓ బిడ్డకి జన్మనివ్వడం జరిగింది.
ఈ క్రమంలో సినిమాలు కూడా తగ్గించింది కాజల్. అలా అని ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మధ్యలో ‘భగవంత్ కేసరి’ వంటి హిట్లు ఈమె ఖాతాలో పడ్డాయి. ప్రస్తుతం ఈమె నందమూరి బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ‘రామాయణ’ లో కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే హిందీలో చేసిన మరో సినిమా ‘ది ఇండియా స్టోరీ’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె బాలీవుడ్ పాపులర్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో కాజల్..కి సౌత్ సినీ పరిశ్రమ గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.
అందులో ‘దక్షిణాదిలో హీరోయిన్ల గ్లామర్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎక్కువగా బొడ్డు, నడుము చూపించడానికే దర్శకులు ఇంట్రెస్ట్ చూపిస్తారట కదా’ అంటూ కాజల్ (Kajal) ను యాంకర్ ప్రశ్నించడం జరిగింది. అందుకు కాజల్.. “అప్పట్లో ఇలాంటి అపోహలు ఉండేవోమో. కానీ ఇప్పుడు సౌత్ సినిమా స్థాయి పెరిగింది.సౌత్ సినిమా అంటే ఇండియా మొత్తం గౌరవిస్తున్నారు” అంటూ గొప్పగా స్పందించింది. ఈ క్రమంలో తాప్సి, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లను ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్లు. ఎందుకంటే గతంలో సౌత్ సినిమా మేకర్స్, ఆడియన్స్ పర్వర్టెడ్ అన్నట్టు వాళ్ళు కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.