కాజల్ వేలుకి డైమండ్ రింగ్.. వైరల్ అవుతున్న వీడియో..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. ఇటీవల ముంబైకు చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్ళి చేసుకోబోతున్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గౌతమ్ కిచ్లు.. కాజల్ కు చిన్నప్పటి నుండీ స్నేహితుడు. ఈమె కుటుంబ సభ్యులకు కూడా గౌతమ్ చాలా క్లోజ్ అట..! ఇదిలా ఉండగా.. అక్టోబర్ 30న కాజల్ – గౌతమ్ ల వివాహం జరగబోతుంది. ఈ క్రమంలో కాజల్ ఇంట్లో పెళ్ళి సందడి మొదలైనట్టు కూడా ఆమె తెలిపింది.

ఈమె పెళ్ళి… కొద్దిపాటి బంధువులు మరియు స్నేహితుల సమక్షంలో జరుగబోతున్నట్టు కూడా కాజల్ తెలిపింది. ఇదిలా ఉండగా.. తాజాగా కాజల్ తన చేతివేళ్లను చూపిస్తూ ఓ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కాజల్ చేతి వేలికి ఒక డైమండ్‌ రింగ్‌ ఉండడం విశేషం.’ఆమె కారులో వెళ్తున్న టైంలో ఈ వీడియోని తీసినట్టు స్పష్టమవుతుంది. ఈ డైమండ్ రింగ్ కచ్చితంగా ఆమె ఎంగేజ్మెంట్ కు సంబంధించినదే అని అందరూ కామెంట్లు పెడుతున్నారు.

ఇటీవల కాజల్ కు కాబోయే భర్త గౌతమ్ కూడా వెడ్డింగ్ కు సంబంధించి షాపింగ్ చేస్తున్నట్టు తన సోషల్ మీడియాలో తెలిపాడు. అంతేకాదు… పెళ్లి తర్వాత వీళ్ళిద్దరూ ఉండబోయే కొత్త ఇంటి ఫోటోలు కూడా నేట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus