బెల్లంకొండ బాబు సరసన కాజల్ అగర్వాల్!

  • February 4, 2018 / 02:42 PM IST

క్రేజీ కన్యకామని కాజల్ అగర్వాల్ ప్రెజంట్ జనరేషన్ హీరోయిన్స్ లో మోస్ట్ పాపులర్ మాత్రమే కాదు చిత్రసీమలోకి అడుగిడి పదేళ్ళు పూర్తవుతున్నా వరుస అవకాశాలు అందుకొంటూ నవతరం నాయికలకు కూడా సవాలు విసురుతోంది. వన్నెతగ్గని అందంతోపాటు అభినయ సామర్ధ్యం, సౌత్ ఇండియన్ లాంగ్వేజస్ అన్నిట్లో భారీ ఫ్యాన్ బేస్ మరియు పాపులారిటీ ఉండడం కాజల్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఒకానొక సందర్భంలో కాజల్ కి ఇక సినిమా రావు అని అందరూ ఫిక్సయిపోగా.. స్టార్ హీరోల సరసన అవకాశాలు అందిపుచ్చుకొని తన స్టామినాను ప్రూవ్ చేసుకొంది.

ప్రస్తుతం అమ్మడు తన తొలి చిత్ర కథానాయకుడు కళ్యాణ్ రామ్ సరసన “ఎమ్మెల్యే” (మంచి లక్షణాలున్న అబ్బాయి) చిత్రంలో నటిస్తోంది. ఆల్రెడీ ఈ సినిమాలోని అమ్మడి చీరకట్టు స్టిల్స్ యువత హృదయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. అయితే.. తాజా సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్ కుర్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సినిమా సైన్ చేసినట్లు తెలుస్తోంది. నాని అనే కొత్తబ్బాయి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో తన రోల్ నచ్చడంతో కాజల్ హీరోయిన్ గా నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళేది మాత్రం ఈ ఏడాది చివర్లో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus