పదేళ్ల కెరీర్ లో కాజల్ కు తీరని కోరిక ఏంటంటే..?!
- April 26, 2016 / 10:07 AM ISTByFilmy Focus
కథానాయికగా అతి త్వరలో పదేళ్లు పూర్తి చేసుకోబోతున్న కాజల్ అగర్వాల్ ఇప్పటివరకూ ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటించింది. ఎందరో యువ కథానాయకులు మరియు సీనియర్ హీరోలతో జత కట్టింది. ఇప్పటికీ కాజల్ అగర్వాల్ క్రేజ్ ఏం తగ్గలేదు. అయితే.. కథానాయికగా కాజల్ కు ఓ తీరని కోరిక ఉందట. అదేంటంటే.. ఒక ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటించి.. హీరోలను మించి ఫైట్స్ చేయాలని ఆమె కోరికట.
ఇటీవల ఓ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యులో కాజల్ ఈ విషయాన్ని చెప్పింది. కాజల్ స్వయంగా చెప్పింది కాబట్టి.. ఏ దర్శకుడైనా కాజల్ కు ఆ తరహా కథను సిద్ధం చేసి, ఆమెకు వినిపిస్తాడేమో చూడాలి. కాజల్ అభిమానులు కూడా ఆమెను ఓ యాక్షన్ రోల్ లో చూడాలని తహతహలాడుతున్నారు!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














