అనుష్క, నయనతార, తమన్నా, కాజల్… వీరంతా దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్ర కథానాయికలుగా పేరుగాంచారు. స్టార్ హీరోల సరసన నటిస్తూ మంచి రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అంతేకాదండోయ్.. అనుష్క, నయనతార, తమన్నాలు అయితే మధ్య మధ్యలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోను మెప్పిస్తున్నారు. కథని బట్టి క్యారక్టర్ ని బట్టి రెమ్యునరేషన్ తగ్గిస్తూ, పెంచుతూ.. అటు పేరుని, ఇటు డబ్బులను వెనకేసుకుంటున్నారు. ఇక కాజల్ మాత్రం ఎన్ని లేడీ ఓరియెంటెడ్ పాత్రలు వచ్చినప్పటికీ, భారీ పారితోషికం ఇస్తానని చెప్పినప్పటికీ ఓకే చెప్పలేదు. హీరోయిన్ గా క్రేజ్ తగ్గినప్పుడు అటువైపు వెళ్లాల్సిన పనేముందని కాజల్ మొన్నటి వరకు చెబుతూ వచ్చింది.
కానీ రీసెంట్ గా కాజల్ తన ఆలోచనను మార్చుకుంది. సింగిల్ గా సినిమాని మోయడానికి సిద్ధమైందని ఫిల్మ్ నగర్ వాసులు చెప్పారు. పి.వాసు దర్శకత్వంలో తమిళ, తెలుగు బైలింగ్వల్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. ఇందు కోసం కాజల్ ఏకంగా 2 కోట్ల పారితోషికం అందుకుంటోందని సమాచారం. కథ, కాసులు రెండూ బాగుండడంతో ఈ ప్రాజక్ట్ కి ఒకే చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం కాజల్ పారిస్ పారిస్ అనే తమిళ మూవీ చేస్తోంది. ఇది తప్ప ఆమె చేతిలో ఏ మూవీ లేదు. అవకాశాలు తగ్గిపోవడంతోనే ఈమె లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు వెళ్లిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ చిత్రం తర్వాత అటువంటి కథలనే చేస్తుందా? లేక హీరోయిన్ గాను చేస్తుందా ? అనేది.. ఆ చిత్రం ఫలితం బట్టి ఆధారపడి ఉంటుంది.