Kajal Eliminated: ఆఖరి వారం ఎలిమినేట్ అయ్యింది కాజలే..! అసలు ఏం జరిగింది..!

  • December 11, 2021 / 06:43 PM IST

బిగ్ బాస్ హౌస్ లో ఆఖరి ఎలిమినేషన్ లో భాగంగా కాజల్ ఎలిమినేట్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. నిజానికి లాస్ట్ వీక్ నామినేషన్స్ లో ఫస్ట్ డే నుంచీ కూడా అన్ అఫీషియల్ సైట్స్ లో కాజల్ ఓటింగ్ లో వెనకబడి ఉంది. సిరి, మానస్ లతో పోటీ పడలేకపోయింది. నిజానికి కాజల్ ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సింది. జెస్సీ హెల్త్ ఇష్యూస్ కారణంగా ఆవారం ఇమ్యూనిటీని పొందింది. అప్పుడు హౌస్ లో ఎలిమినేషన్ జరగకపోవడంతో బచాయించింది. ఆ తర్వాత ఎలిమినేషన్స్ లో కాజల్ ని ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇచ్చాడు సన్నీ. అయినా కూడా అప్పుడు కాజల్ ఓటింగ్ లో సేఫ్ అయ్యింది. దీంతో రవి ఎలిమినేట్ అయ్యాడు.

అయితే, ఇప్పుడు ఎట్టకేలకి హౌస్ లో కాజల గేమ్ ఫినిష్ అయ్యింది. ఆర్జే కాజల్ గా హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన కాజల్ తనదైన స్ట్రాటజీలతో ముందుకెళ్లింది. ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తూ లాజికల్ గా గేమ్ ని అడింది. ప్రతి సిట్యువేషన్ ని తనకి ఫేవర్ గా మలచుకోవడంలో సక్సెస్ అయ్యింది. అంతేకాదు, అనీమాస్టర్ ఎంతో రెచ్చగొట్టినా కూడా కామ్ గా ఉంది. చాలామంది ప్రోవోకింగ్ స్టార్ అని పేరు పెట్టినా , కన్నింగ్ కాజల్ అని పేరు పెట్టినా కూడా ఎప్పుడూ రియాక్ట్ అవ్వలేదు. మొదట్లో రవితో టామ్ అండ్ జెర్రీ ఫైట్ దగ్గర్నుంచీ, మానస్ అండ్ సన్నీలతో ఫ్రెండ్షిప్ వరకూ కాజల్ జెర్నీ బ్యూటిఫుల్ గా నడిచింది.

ఇక టవర్ టాస్క్ లో సన్నీ సిరిని అప్పడం అన్నందుకు సన్నీని అందరూ నిందిస్తుంటే సన్నీకి అండగా నిలిచింది. సన్నీ తరపున స్టాండ్ తీస్కుని హోస్ట్ నాగార్జునని సైతం ప్రశ్నించింది. సన్నీ ఇంటెన్షన్ అది కాదని నిర్భయంగా చెప్పింది. అలాగే, ఎంతమంది వ్యతిరేకిస్తున్నా, తిట్టుకున్నా కూడా ఎవిక్షన్ ఫ్రీ పాస్ విషయంలో తన నిర్ణయానికి కట్టుబడి తన ఫ్రెండ్ అయిన సన్నీకి పాస్ వచ్చేలా చేసింది. హౌస్ లో ఒక్కవారం కూడా ఇమ్యూనిటీ రాకపోయినా, కెప్టెన్ అవ్వకపోయినా కూడా టాప్ 6 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచి తన సత్తాని చాటింది కాజల్.

ఈవారం ఎలిమినేషన్ గండం ఉందని ముందుగానే హౌస్ లో గ్రహించింది. కాజల్ ఊహించినట్లుగానే ఎలిమినేట్ అయ్యింది. అయితే,కాజల్ కి టాప్ 5లో ఉండాలని, బిగ్ బాస్ హౌస్ లో తన జెర్నీ చూస్కోవాలని ఉండేది. కానీ అది తీరకుండానే ఎలిమినేట్ అయ్యింది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus