ఇప్పుడు ఎన్టీఆర్ ను కాకా పడుతున్న కాజు పాప…

ఎన్టీఆర్, కాజల్ ఇద్దరూ మంచి స్నేహితులు. వీరిద్దరిదీ సక్సెస్ ఫుల్ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి నటించిన ‘బృందావనం’ ‘బాద్ షా’ ‘టెంపర్’ వంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. కేవలం ఎన్టీఆర్ తో ఉన్న స్నేహం వల్లే… ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో ‘పక్కా లోకల్’ అనే ఐటెం సాంగ్ చేసింది కాజల్. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా.. తారక్ ఇంటికి వెళ్ళి… అతని పిల్లలతో ఆడుకుంటుందట ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే..

మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఫ్యాన్స్ అతని బర్త్ డే కోసం… అలాగే ఆరోజు విడుదల కానున్న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే అతని బర్త్ డే సి డి పి ని కూడా ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు విడుదల చేసారు. ఇదిలా ఉంటే.. కాజల్ ఇప్పుడు ఎన్టీఆర్ పేరుని మార్చేసింది. అవును మీరు వింటున్నది నిజమే. అసలు మ్యాటర్ ఏంటంటే… కు అడ్వాన్స్ బర్త్ డే విషెస్ చెబుతూ… తారక్‌కు తరామీ అనే కొత్త పేరు పెట్టింది ఈ బ్యూటీ.

తరామీ అంటే ‘తారక్ + సునామీ’ అని అర్థమట. అది కూడా కాజలే చెప్పుకొచ్చింది. తనకు ఎన్టీఆర్ ఓ సునామిలా కనిపిస్తాడట. అందుకే ఎన్టీఆర్ ను… తారక్ అనే కంటే తరామీ అనడం కరెక్ట్ అని అంటుంది. అయితే ఉన్నట్టు ఉండి… ఇప్పుడు ఎన్టీఆర్ ను ఎందుకు కాకా పడుతున్నట్టు.. అవకాశాల కోసమేనా అని కొందరు కామెంట్లు కూడా చెయ్యడం మొదలు పెట్టారు. ఏమో.. బహుసా వారి సందేహం కూడా నిజమే అవ్వొచ్చు.. చెప్పలేం…!

Most Recommended Video

అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు
అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన తెలుగు సినిమాలు…!
‘మహానటి’ లోని మనం చూడని సావిత్రి, కీర్తి సురేష్ ల ఫోటోలు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus