అందంతో పాటు ఆద్భుతమైన నటన అనగానే… మనకి గుర్తుకు వచ్చే నటి సావిత్రి. ఇప్పటికీ కొంతమంది హీరోయిన్ లు ఎన్ని అవార్డులు దక్కించుకున్నా… ఒక్క సారైన సావిత్రి గారితో పోలిస్తే బాగుణ్ణు కదా అని ఆశపడుతుంటారు అనడంలో అతిశయోక్తి లేదు. ఆ సువర్ణ అవకాశం కేవలం కీర్తి సురేష్ కు మాత్రమే దక్కింది. దివంగత నటి… మహానటి అయిన సావిత్రి గారి జీవితం 75 శాతం వరకూ తెరిచిన పుస్తకమే. కానీ 25 శాతం ఆమె జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొంది. అలాంటి విషయాల్ని కళ్ళకు కట్టినట్టు తీశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ దృశ్య కావ్యాన్ని ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై ఆశ్వినీ దత్ తో పాటు ఆమె కుమార్తెలు ప్రియాంకా దత్, స్వప్న దత్ లు కలిసి నిర్మించారు.
అయితే ముందుగా సావిత్రి పాత్ర కోసం నిత్యా మేనన్ ను అనుకున్నారు. కానీ ఆమె కొన్ని కారణాల వల్ల తప్పుకుంది. దాంతో కీర్తి సురేష్ ను ఎంపిక చేసుకున్నారు. కీర్తి సురేష్… సావిత్రి పాత్రలో నటించింది అనే కంటే… జీవించింది అనే చెప్పాలి. ఈ పాత్ర కోసం ఆమె ఎంతగా హార్డ్ వర్క్ చేసింది అనే విషయం ఎవ్వరికీ తెలీదు కానీ.. సింపుల్ గా హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే.అందుకే నేషనల్ అవార్డు కూడా కొట్టేసింది ఈ బ్యూటీ.సావిత్రి గారు ఎలా నిలబడే వారు.. ఫోటోలకు ఎలాంటి స్టిల్స్ ఇచ్చే వారు.. ఎలా నడిచే వారు.. ఇలాంటివి అన్నీ అచ్చం అలాగే దించేసింది. నమ్మడం లేదా… అయితే ఈ అన్ సీన్ స్టిల్స్ చుడండి.మీకే తెలుస్తుంది.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
మహానటి సినిమా లోని డైలాగ్స్
మహానటిలో ఎవరెవరు ఏ పాత్రలు పోషిస్తున్నారు!