వైరలవుతున్న కాజల్ కొత్త పిక్స్..!

తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది కాజల్. కుర్ర హీరోయిన్లు ఎంతమంది వచ్చినా… ఆ పోటీని తట్టుకుని నిలబడుతుంది. దాదాపు తెలుగు తమిళ భాషల్లో అందరి స్టార్ హీరోల సరసన నటించింది. ఇప్పుడు కుర్ర హీరోల సరసన కూడా నటిస్తుంది. తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి నటించిన ‘సీత’ చిత్రం ఈ మే నెలలోనే విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని తేజ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక తమిళంలో కూడా జయం రవి సరసన ఓ చిత్రంలో నటిస్తుంది.

‘కోమలి’ అనే టైటిల్ తో రూపొందే ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రదీప్ రంగనాథన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఈసారి కె.గణేష్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ తో పాటూ సంయుక్త హెగ్దే కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ చిత్రంలో కాజల్ కి ఓ హాట్ సాంగ్ ఉందట. ఈ సాంగ్లో కాజల్ గ్లామర్ డోస్ ఓ రేంజ్లో ఉంటుందట. ఇక దీనికి సంబందించిన ఓ పిక్ కూడా బయటకు వచ్చింది. పసుపు రంగు దుస్తులలో అందులోనూ తడి దుస్తులలో కాజల్ చాలా హాట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ’33 ఏళ్ళ వయసు వచ్చినా.. తన చెల్లికి పెళ్ళై.. పిల్లలు కూడా పుట్టేసినా కాజల్ ఇంత గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తుంది’ అంటూ నెటిజెన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఈ చిత్రం నుండీ మరికొన్ని కాజల్ పిక్స్ కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus