మరో ఐటెమ్ సాంగ్ సైన్ చేసిన కాజల్!

  • May 27, 2018 / 11:37 AM IST

ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో “అరవింద సమేత వీర రాఘవ” చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈషా రెబ్బ మరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ఇప్పుడు మరో తారామణి జాయిన్ అయ్యిందని వినికిడి. ఈ చిత్రంలోని ఒక స్పెషల్ సాంగ్ లో కాజల్ కనువిందు చేయనుందట. దాదాపు అందరు స్టార్ డైరెక్టర్స్ తో వర్క్ చేసిన కాజల్ కి ఇప్పటివరకూ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించే అవకాశం రాలేదు. అందుకే “జనతా గ్యారేజ్” అనంతరం మళ్ళీ స్పెషల్ సాంగ్స్ చేయను అని భీష్మించుకొని కూర్చున్నప్పటికీ తనకు ఇష్టమైన కథానాయకుడు ఎన్టీయార్, తను అభిమానించే దర్శకుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో మరో మాట మాట్లాడకుండా అంగీకరించిందట కాజల్.

కాజల్ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఒక సినిమా, తమిళంలో “క్వీన్” రీమేక్ లో నటిస్తోంది. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు అందర్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. మరి కాజల్ ఈసారి “పక్కాలోకల్” పాపలా కనిపిస్తుందా లేక త్రివిక్రమ్ శైలిలో స్టైలిష్ బ్యూటీగా కనువిందు చేస్తుందా అనేది తెలియాలంటే దసరా వరకూ ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus