చిరంజీవి సినిమాలో అవకాశాన్ని వదులుకున్న కాజల్ అగర్వాల్!

బాహుబలి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. తొలి స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకి సంబంధించి పనులు వేగంగా సాగుతున్నాయి. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, జగపతి బాబు వంటి సీనియర్ నటులు నటించనున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయన తార హీరోయిన్ గా ఫిక్స్ అయింది. అయితే ఇందులో మరో కీలకరోల్ ఉందంటా. అందుకోసం కాజల్ అగర్వాల్ ని చిత్ర బృందం సంప్రదించగా ఆమె నో చెప్పిన్నట్లు తెలిసింది. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

కాజల్ కి రామ్ చరణ్ తో మంచి అనుబంధం ఉంది. ఇద్దరు కలిసి మూడు చిత్రాల్లో నటించారు. అంతేకాదు చెర్రీ నిర్మించిన ఖైదీ నంబర్ 150 లోను చిరు సరసన ఆడిపాడింది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తోను సినిమాలు చేసింది. అటువంటిది సైరా సినిమాలో ఛాన్స్ ఎందుకు వదులుకుందోనని టాలీవుడ్ వర్గాలవారు చర్చించుకుంటున్నారు. చరణ్ మాత్రం కాజల్ స్థానంలో ప్రగ్యా జైశ్వాల్ ను తీసుకున్నట్టు తెలిసింది. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ మూవీ వచ్చే నెల సెట్స్ పైకి వెళ్లనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus