కళ్యాణ్ రామ్ సినిమాలో కాజల్ రోల్ ఇదే

క్రేజీ కన్యకామని కాజల్ అగర్వాల్ ప్రెజంట్ జనరేషన్ హీరోయిన్స్ లో మోస్ట్ పాపులర్ మాత్రమే కాదు చిత్రసీమలోకి అడుగిడి పదేళ్ళు పూర్తవుతున్నా వరుస అవకాశాలు అందుకొంటూ నవతరం నాయికలకు కూడా సవాలు విసురుతోంది. వన్నెతగ్గని అండంతోపాటు అభినయసారధ్యం సౌత్ ఇండియన్ లాంగ్వేజస్ అన్నిట్లో భారీ ఫ్యాన్ బేస్ మరియు పాపులారిటీ ఉండడం కాజల్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఒకానొక సందర్భంలో కాజల్ కి ఇక సినిమా రావు అని అందరూ ఫిక్సయిపోయిన సమయంలో స్టార్ హీరోల సరసన అవకాశాలు అందిపుచ్చుకొని తన స్టామినాను ప్రూవ్ చేసుకొంది.

ప్రస్తుతం అమ్మడు తన తొలి చిత్ర కథానాయకుడు కళ్యాణ్ రామ్ సరసన “ఎమ్మెల్యే” (మంచి లక్షణాలున్న అబ్బాయి) చిత్రంలో నటిస్తోంది. ఆల్రెడీ ఈ సినిమాలోని అమ్మడి చీరకట్టు స్టిల్స్ యువత హృదయాల్లో వేడి పుట్టించగా.. కాజల్ ఈ చిత్రంలో మరింత గ్లామరస్ గా నటించనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె ఎన్నారై లేడీగా కనిపించనుంది. కాజల్ కలర్ ఎలాగూ ఎన్నారైను తలపిస్తుంది. ఇక ఆమె అందాల ఆరబోత విషయంలోనూ ఏమాత్రం మొహమాటపడకుండా ఈ చిత్రంలో అలరించనుందట. సో, ఓవరాల్ గా కాజల్ ఈ సినిమాతో మత్తెక్కించనుందన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus