సినిమా జనాలు అందరూ ఒకలా ఉండరు. ఒక్కొక్కరికీ ఒక్కో రకం సినిమా నచ్చుతుంది. అలాగే సినిమాను చూసే ప్లాట్ ఫామ్ బట్టి కూడా పాఠలకుల ఆలోచన మారిపోతుంటుంది. ఈ విషయంలో మీకేమైనా డౌట్ ఉందా? అయితే మీకు కచ్చితంగా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా గురించి చెప్పాల్సిందే. ఎందుకంటే బాక్సాఫీసు దగ్గర, ఓటీటీలో భారీ విజయం అందుకున్న ఆ సినిమా టీవీల్లో డిజాస్టర్‌గా మిగిలింది. సిల్వర్ స్క్రీన్‌కు, స్మాల్ స్క్రీన్‌కి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది.
ఈ వ్యత్యాసం సైజ్ విషయంలో కాదు.. సినిమాను ఆదరించే విషయంలో. ఈ విషయాన్ని రీసెంట్ సినిమల విషయంలో చూస్తే.. ‘సలార్’ (Salaar) ఫలితం గుర్తు చేయాలి. ఏమో కానీ ఆ సినిమాను టీవీల్లో పెద్దగా చూడలేదు. యాక్షన్ పాళ్లు ఎక్కువగా ఉన్నాయి కదా అందుకే చూడలేదేమో అనిపించొచ్చు. ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ పరిస్థితీ అంతే. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అనే ట్రెండీ నేమ్ పెట్టుకుని సంక్రాంతి సీజన్‌లో ‘జీ తెలుగు’లో ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను టెలీకాస్ట్ చేశారు.
ఈ క్రమంలో సినిమాకు 5.26 టీఆర్పీ మాత్రమే వచ్చిందట. ఇతర పెద్ద సినిమాలతో పోలిస్తే ఈ నెంబరు చాలా తక్కువే. చాలా అంటే చాలా తక్కువ అని చెప్పాలి. వాటికి 20 + వస్తే.. దీనికి 10 కూడా రాలేదు. మరోవైపు థియేటర్లలో తేడా కొట్టిన సినిమాలకు టీవీలో ఓ మోస్తరు ఆదరణ వస్తోంది. అయితే ఈ పరిస్థితి ఇన్‌స్టంట్ ఆన్సర్ ఒకటి జనాల్లో ఉండొచ్చు.
అదే ఆల్‌రెడీ ఓటీటీల్లో, థియేటర్‌లో చూసేశారు కదా.. అందుకే ‘కల్కి 2898 ఏడీ’ని టీవీలో చూడలేదు అని. అయితే చాలా సినిమాలు ఈ సినారియోలో కూడా మంచి టీఆర్పీ అందుకున్నాయి. అంతెందుకు జపాన్‌లోనూ ‘కల్కి 2898 ఏడీ’కి సరైన ఆదరణ దక్కలేదు అని అంటున్నారు. దీని వెనుక ఉన్న కారణాలేంటో దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) చూసుకోకపోతే రెండో పార్టు విషయంలో ఇబ్బంది పడతారు.