The Raja Saab: మారుతికి అదో ప్లస్ పాయింట్.. ఈసారి ఎలాగైనా కొట్టేయొచ్చు.!

  • July 3, 2024 / 12:21 PM IST

ప్రభాస్ (Prabhas)  హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD)  ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ‘బాహుబలి 2’ (Baahubali 2) తర్వాత ప్రభాస్ సినిమాకి యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది ఈ సినిమాకే అని చెప్పాలి..! అందువల్ల వీక్ డేస్ లో కూడా కలెక్షన్స్ డీసెంట్ గా ఉన్నాయి. టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి, వర్షాలు కురుస్తున్నాయి..వంటి వాటిని ప్రేక్షకులు లెక్క చేయకుండా థియేటర్లకు కదిలి వెళ్తున్నారు.

ప్రభాస్ ఇమేజ్ ‘బాహుబలి’ వల్ల వచ్చిన లాటరీ ఇమేజ్ కాదని ‘కల్కి..’ తో ప్రూవ్ అయ్యింది. ఇక ఏడాదిలో ప్రభాస్ నుండి వచ్చిన 3 వ సినిమా ఇది. టాలీవుడ్లో ఏ స్టార్ హీరో కూడా ఇంత ఫాస్ట్ గా సినిమాలు చెయ్యట్లేదు. ఇక ‘కల్కి..’ తర్వాత ప్రభాస్ నుండి ‘రాజా సాబ్’ (The Raja saab) అనే సినిమా రాబోతుంది. మారుతి (Maruthi Dasari) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ నిర్మిస్తోంది. రూ.250 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుంది.

ఇప్పుడు ప్రభాస్ కి ఉన్న దృష్ట్యా చూసుకుంటే.. ఇది కాస్త తక్కువ బడ్జెట్ సినిమా అనే చెప్పాలి. హారర్ జోనర్ లో రూపొందుతున్న సినిమా ఇది. మారుతి సినిమా అంటే ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి ఉండదు. అతని సినిమాల్లో ఫోర్స్డ్ కామెడీ ఎక్కువగా ఉంటుంది అనేది అందరి నమ్మకం. కానీ ‘కల్కి..’ వల్ల ప్రభాస్ ఇమేజ్ ఇంకాస్త పెరిగింది కాబట్టి.. కచ్చితంగా నిర్మాతలకి ఇది సేఫ్ ప్రాజెక్టు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus