పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD). ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్ (C. Aswani Dutt) ఈ చిత్రాన్ని తన కూతుర్లు స్వప్న దత్ (Swapna Dutt), ప్రియాంక దత్ (Priyanka Dutt)..లతో కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మొదటి రోజు మొదటి షోతోనే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను సాధించింది ‘కల్కి’.
తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ ‘కల్కి..’ విజయం సాధించింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 91.80 cr |
సీడెడ్ | 21.65 cr |
ఉత్తరాంధ్ర | 21.85 cr |
ఈస్ట్ | 12.40 cr |
వెస్ట్ | 09.20 cr |
గుంటూరు | 11.28 cr |
కృష్ణా | 11.22 cr |
నెల్లూరు | 6.01 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 185.41 cr |
కర్ణాటక | 36.15 cr |
తమిళనాడు | 21.85 cr |
కేరళ | 12.83 cr |
హిందీ(నార్త్) | 146.38 cr |
ఓవర్సీస్ | 128.00 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 530.62 cr (షేర్) |
‘కల్కి 2898 ad’ చిత్రానికి రూ.381 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మొత్తం మీద రూ.385 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.530.62 కోట్ల షేర్ ను రాబట్టింది.10 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ ఫైనల్ గా రూ.145.62 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.