NTR30: సెట్స్ వేయమని చెప్పిన కళ్యాణ్ రామ్!

టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఎన్టీఆర్30 ఒకటి. కొరటాల శివ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత ఎన్టీఆర్ ఈ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మాత్రం మొదలుకాలేదు. అలానే ఒక్క అప్డేట్ కూడా లేదు. దీనికి కారణంగా స్క్రిప్ట్ విషయంలో ఆలస్యం జరుగుతుండడమే. అప్పటివరకు హిట్స్ తో దూసుకుపోయిన కొరటాల శివ ‘ఆచార్య’తో డిజాస్టర్ అందుకున్నారు.

ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పై స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు కొరటాల శివ. అందుకే ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. రీసెంట్ గా సినిమా క్లైమాక్స్ పార్ట్ పై వర్క్ చేయమని ఎన్టీఆర్.. కొరటాలని అడిగారట. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా వ్యవహారిస్తోన్న కళ్యాణ్ రామ్ ఈ సినిమా వర్క్ స్టార్ట్ చేయమని కొరటాల శివకి చెప్పినట్లు తెలుస్తోంది. సినిమా ఫస్ట్ హాఫ్ విషయంలో అటు ఎన్టీఆర్, ఇటు కళ్యాణ్ రామ్ ఇద్దరూ సంతృప్తిగానే ఉన్నారు.

అందుకే ముందుగా షూటింగ్ మొదలుపెడితే బెటర్ అని అనుకుంటున్నారు. ఈ మేరకు సినిమా సెట్స్ ను నిర్మించమని చెప్పారు కళ్యాణ్ రామ్. కోకాపేట్ లో దిల్ రాజు ల్యాండ్ లో లేదంటే.. రీసెంట్ గా మొదలుపెట్టిన అల్లు స్టూడియోస్ లో ఈ సెట్ నిర్మాణం జరగబోతుంది. దానికి తగ్గట్లుగా కొరటాల శివ.. ఆర్ట్ డైరెక్టర్స్ కలిసి మంతనాలు జరుపుతున్నారు.

మరోపక్క క్లైమాక్స్ పై కూడా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో టాలీవుడ్ కి సంబంధించిన చాలా మంది టాలెంటెడ్ రైటర్స్ ఇన్వాల్వ్ అయినట్లు సమాచారం. ఇందులో రష్మిక హీరోయిన్ గా కనిపించబోతుందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus