Kalyan Ram: మైత్రీ నిర్మాతలు ఉప్పెనలాంటి సక్సెస్ ఇస్తారా..?

నందమూరి హీరోలలో ఒకరైన కళ్యాణ్ రామ్ నటుడిగా మంచి పేరును సంపాదించుకున్నా కెరీర్ విషయంలో మాత్రం ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమాల్లో సక్సెస్ సాధించిన సినిమాల కంటే ఫ్లాప్ అయిన సినిమాలే ఎక్కువగా ఉండటం గమనార్హం. కళ్యాణ్ రామ్ గత సినిమా ఎంత మంచివాడవురా గతేడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై ఫ్లాప్ ఫలితాన్ని అందుకుంది. అతనొక్కడే, పటాస్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కోసం కళ్యాణ్ రామ్ ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఒక సినిమాలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నారు. ఉప్పెన సక్సెస్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పేరు మారుమ్రోగుతోంది. మహేష్ బాబు సర్కారు వారి పాట, అల్లు అర్జున్ పుష్ప సినిమాలు కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పైనే తెరకెక్కుతున్నాయి. కొత్త దర్శకుడు బుచ్చిబాబు సానాతో సక్సెస్ సాధించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కళ్యాణ్ రామ్ సినిమాతో రాజేంద్ర అనే మరో కొత్త డైరెక్టర్ ను టాలీవుడ్ కు పరిచయం చేయనున్నట్టు తెలుస్తోంది.

త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా కళ్యాణ్ రామ్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ కు కూడా ఉప్పెన లాంటి సక్సెస్ ను ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్న కళ్యాణ్ రామ్ ఆకలి తీరుస్తారేమో చూడాల్సి ఉంది. ఈ సినిమా లుక్ కోసమే కళ్యాణ్ రామ్ రెండు నెలలు కష్టప్డ్డారని సమాచారం. 2021 సెకండాఫ్ లో ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus