Kalyan Ram: బింబిసార విషయంలో కళ్యాణ్ రామ్ అలా చేస్తారా?

  • May 29, 2022 / 12:21 PM IST

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సినీ కెరీర్ లో అతనొక్కడే, పటాస్ మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. హరే రామ్, 118 మరికొన్ని సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కమర్షియల్ గా ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. అయితే కళ్యాణ్ రామ్ కొంతకాలం గ్యాప్ తీసుకుని నటిస్తున్న బింబిసార సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. భారీ బడ్జెట్ తో బింబిసార తెరకెక్కగా ఆగష్టు 5వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ ఏడాది సెకండాఫ్ లో రిలీజయ్యే సినిమాలలో పెద్ద సినిమాలు ఎక్కువగా లేకపోవడంతో మిడిల్ రేంజ్ హీరోల సినిమాలపైనే డిస్ట్రిబ్యూటర్లు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజైన బింబిసార పోస్టర్లు, టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. అయితే కళ్యాణ్ రామ్ ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఎన్టీఆర్ సపోర్ట్ తీసుకుంటే బెటర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బింబిసార సినిమాకు ఎన్టీఆర్ తో వాయిస్ ఓవర్ ఇప్పిస్తే సినిమాకు బిజినెస్ విషయంలో కూడా హెల్ప్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి కళ్యాణ్ రామ్ ఈ దిశగా అడుగులు వేస్తారో చూడాల్సి ఉంది. మగధీర తరహా కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని ఈ కాలానికి చెందిన యువకుడిగా, బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ కనిపిస్తారని తెలుస్తోంది. బింబిసార లాంటి భారీ బడ్జెట్ సినిమాలకు ప్రత్యేకతలు ఎంత ఎక్కువగా ఉంటే సినిమాలు కమర్షియల్ గా అంత సక్సెస్ సాధిస్తాయి.

కళ్యాణ్ రామ్ కెరీర్ విషయంలో సక్సెస్ కావడానికి ఎన్టీఆర్ సైతం తన వంతు సహకారం అందిస్తున్నారు. ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ ల నిర్మాణంలో కళ్యాణ్ రామ్ కూడా భాగస్వామి అనే సంగతి తెలిసిందే. మరోవైపు బింబిసార రెండు పార్టులుగా తెరకెక్కుతోందని పార్ట్1 రిజల్ట్ ను బట్టి సెకండ్ పార్ట్ విషయంలో నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. నటుడిగా, నిర్మాతగా కళ్యాణ్ రామ్ కు సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus