Jr NTR: ఎన్టీఆర్ లో ఇంత టాలెంట్ దాగి ఉందా.. అసలు విషయం చెప్పిన కళ్యాణ్ రామ్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఇలా నందమూరి తారక రామారావు మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఎన్టీఆర్ తన నటనతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే ఎన్టీఆర్ ప్రతి ఆదివారం వచ్చిందంటే తనలో ఉన్నటువంటి టాలెంట్ మొత్తం బయట పెడతారు అంటూ తాజాగా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి ఒక సీక్రెట్ పెట్టారు.

ఎన్టీఆర్ ఆదివారం వచ్చిందంటే ఇంట్లో వివిధ రకాల ఆహార పదార్థాలను తానే స్వయంగా తయారు చేస్తారు అంటూ కళ్యాణ్ రామ్ వెల్లడించారు. ఇలా ఏదైనా స్పెషల్ డిష్ చేసినప్పుడు తప్పకుండా నన్ను కూడా పిలుస్తారని కళ్యాణ్ రామ్ వెల్లడించారు. అలాగే ఆయన ఎప్పుడైనా ఫ్రస్టేషన్లో ఉంటే వెంటనే కిచెన్ లోకి వెళ్లి ఫ్రస్టేషన్ తగ్గడానికి కూడా వంట చేస్తారు అంటూ కళ్యాణ్ రామ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తారక్ వంట చాలా టేస్టీగా తయారుచేస్తారు.

షూటింగ్ లేకపోతే కనుక ఇలా సైడ్ బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు అంటూ సరదాగా మాట్లాడారు. ఈ విధంగా ఎన్టీఆర్ గురించి కళ్యాణ్ రామ్ మాట్లాడటంతో ఎన్టీఆర్ రియాక్టర్ నాకు ప్రస్తుతం సైడ్ బిజినెస్ పెట్టుకోవాలనే ఆలోచన లేదు కాకపోతే వంట చేయడం నాకు చాలా ఇష్టం అంటూ ఎన్టీఆర్ తెలియజేశారు. కొన్నిసార్లు ప్రణతి నేను చేసిన వంట టేస్ట్ చేసి ఒక 100 క్యారేజీలు నాకు చేసి ఇవ్వు అమ్మి పెడతా అంటూ కూడా సరదాగా మాట్లాడుతుందని ఈ సందర్భంగా (Jr NTR)  ఎన్టీఆర్ కూడా మాట్లాడటంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus