Kalyan Ram: నాగార్జున గారి మాటలను ఎప్పుడు మర్చిపోను?: కళ్యాణ్ రామ్

నందమూరి కళ్యాణ్ రామ్ నేడు డెవిల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అభిషేక్ నామా దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా నటించినటువంటి ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కళ్యాణ్ రామ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన సక్సెస్ కు గల కారణాలను కూడా తెలియజేశారు. తాను సినిమాల పరంగా సక్సెస్ అయ్యాను అంటే ఎన్నో కారణాలు ఉన్నాయని అందులో భాగంగా నాగార్జున బాబాయ్ నాకు కొన్ని సలహాలు సూచనలు చెప్పారని

ఆయన చెప్పిన మాటలను నేను ఎప్పటికీ మర్చిపోను అంటూ ఈ సందర్భంగా నాగార్జున చెప్పినటువంటి వ్యాఖ్యల గురించి కళ్యాణ్ రామ్ తెలియచేశారు. ప్రతి హీరో సినిమాల విషయంలో ఆడియన్స్ కొన్ని విషయాలను ఇష్టపడతారు. తమ హీరో సినిమాలలో కొందరు డాన్స్ ఇష్టపడవచ్చు మరికొందరు ఫైట్ ఇష్టపడవచ్చు లేదా కామెడీ ఏదైనా కావచ్చు వారు కోరుకునే అంశాలు మన సినిమాలో ఉండేలా మనం జాగ్రత్త పడాలని బాబాయ్ చెప్పారు.

మనం డిఫరెంట్ స్టోరీలను ట్రై చేసిన కూడా ప్రేక్షకులు ఆశించే విషయాలు మన సినిమాలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ ఒకసారి బాబాయ్ నాకు సలహా ఇచ్చారు ఆరోజు ఆయన చెప్పిన విషయాలను నేను ఎప్పటికీ మర్చిపోలేదని అందుకే నా సినిమాలో ప్రేక్షకులు ఏం కోరుకుంటారనే విషయాలను దృష్టిలో పెట్టుకొని అవి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నానని

ఆ సలహానే నా సక్సెస్ కు కూడా కారణం అయ్యాయి అంటూ ఈ సందర్భంగా (Kalyan Ram) కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా ప్రమోషన్లలో భాగంగా నాగార్జున తనకు ఇచ్చినటువంటి సలహాలు సూచనల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus