ఎన్టీఆర్ బయోపిక్ లో కళ్యాణ్ రామ్!

  • October 30, 2017 / 07:47 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో అందరినీ ఆసక్తి రేకిస్తున్న సినిమా మహానటుడు నందమూరి తారకరామారావు బయోపిక్. తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డగా, తెలుగు పేద ప్రజల ఆరాధ్య దేవుడిగా, రాజకీయాల్లో మార్పు తెచ్చిన వ్యక్తిగా ఎన్టీఆర్ కి మహా చరిత్ర ఉంది. అతని నిజ జీవితాన్ని వెండితెరపై చూసుకోవాలని ప్రతి తెలుగోడు ఎదురుచూస్తున్నాడు. అందుకే ఈ చిత్రానికి సంబందించిన పనులు చకచకా సాగుతున్నాయి. తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ గా నందమూరి బాలకృష్ణ నటించనుండగా,  హరికృష్ణ పాత్రకు నందమూరి కళ్యాణ్ రామ్ ఎంపిక చేసినట్లు తెలిసింది. బాబాయ్, అబ్బాయి కలిసి నటిస్తే చూడాలని నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

వారికీ ఇది శుభవార్తే. ఇక ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు  రోల్ ల్లో జగపతిబాబు కనిపించనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ఈ విషయాలను అధికారికంగా త్వరలో ప్రకటించనున్నారు. భారీ క్రేజ్ నెలకొని ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి  సెట్స్ మీదకు వెళ్లనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus