Devil: బుల్లితెరపై కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీకి రేటింగ్ అంత తక్కువా?

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా సంయుక్త మీనన్ (Samyuktha Menon) హీరోయిన్ గా తెరకెక్కిన డెవిల్ (Devil) మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమాకు సరైన స్థాయిలో ప్రమోషన్స్ జరిగి ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరింత మెరుగ్గా ఉండేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ఈ సినిమా కొన్నిరోజుల క్రితం ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన ఈటీవీలో ప్రసారమైంది. డెవిల్ సినిమాకు బుల్లితెరపై మంచి రేటింగ్ వస్తుందని ఫ్యాన్స్ భావించగా ఈ సినిమాకు కేవలం 2.15 టీఆర్పీ రేటింగ్ వచ్చింది.

కళ్యాణ్ రామ్ సినిమాకు తక్కువ రేటింగ్ రావడం అభిమానులను సైతం ఎంతగానో బాధ పెడుతోంది. పీరియాడికల్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ఇంత తక్కువ రేటింగ్స్ వస్తాయని అస్సలు ఊహించలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ ఒకవైపు హీరోగా మరోవైపు నిర్మాతగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

కళ్యాణ్ రామ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని పాన్ ఇండియా హిట్లను సొంతం చేసుకోవాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కళ్యాణ్ రామ్ దేవర (Devara) సినిమాతో నిర్మాతగా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కాంబినేషన్ లో సినిమా కావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా జూనియర్ ఎన్టీఆర్ తలచుకుంటే ఈ కాంబినేషన్ లో సినిమా రావడం కష్టం కాదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఏప్రిల్ మొదటి వారం నాటికి దేవర షూటింగ్ పూర్తయ్యేలా జూనియర్ ఎన్టీఆర్ ప్లానింగ్ ఉందని సమాచారం అందుతోంది. కళ్యాణ్ రామ్ త్వరలో ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు. కళ్యాణ్ రామ్ భవిష్యత్తు సినిమాలు ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus