నన్ను ద్వేషిస్తున్నందుకు ఆనందంగా ఉంది!

ఈ భూప్రపంచంలో ఏ అమ్మాయి అయినా “ఐ లవ్ యూ” అంటే సడన్ గా సంతోషిస్తుందో లేక ఆశ్చర్యపోతుందో తెలియదు కానీ.. ఎవరైనా “ఐ హేట్ యూ” అంటూ మాత్రం సహించదు, అది రోడ్డునపోతే దానయ్య అయినా. కానీ.. “హలో” సినిమా ద్వారా కథానాయికగా పరిచయమైన కళ్యాణి ప్రియదర్శిని మాత్రం “నన్ను అందరూ ఐ హేట్ యూ అంటుంటే” చాలా ఆనందంగా ఉంది” అంటూ ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతుంది. “ఐ హేట్ యూ” అంటే సంతోషించడమేంటి అని కన్ఫ్యూజన్ అమ్మాయిని తిట్టేయకండి. మన దర్శకమాంత్రికుడు విక్రమ్ కుమార్ లాజిక్ ప్రకారం “ఐ హేట్ యూ” అంటే అమితమైన ప్రేమను వ్యక్తపరచడం అని అర్ధమట.

దాంతో “హలో” సినిమా చూసి కళ్యాణి ప్రియదర్శిని పెర్ఫార్మెన్స్ కి స్పెల్ బౌండ్ అయినవాళ్ళందరూ “ఐ హేట్ యు కళ్యాణి” అని ట్విట్టర్, ఫేస్ బుక్ లో పోలోమని మెసేజులు పంపుతున్నారట. దాంతో.. కళ్యాణి ఆ మెసేజులన్నీ చదువుకుని మురిసిపోతుందట. అలాగే.. తనకు “ఐ హేట్ యు” అని ప్రేమతో మెసేజులు పెట్టినవారందరికీ అమ్మడు “ఐ లవ్ యు” అని రిప్లైస్ ఇస్తూ “హలో” సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది.
అందమైన ముఖారవిందం, అభినయ సామర్ధ్యంతోపాటు సినిమా బ్యాగ్రౌండ్ కూడా ఉండడంతో త్వరలోనే తెలుగు-తమిళ భాషల్లో కళ్యాణి ప్రియదర్శిని బిజీ అవ్వడంలో ఎలాంటి సందేహం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus