Kamal Haasan: కమల్ హాసన్ గిఫ్ట్ చేసిన వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?

సాధారణంగా ఒక సినిమా సక్సెస్ అయితే నిర్మాతలు దర్శకులకు సినీ సెలబ్రిటీలకు తమ వంతు కానుకలు ఇస్తూ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలో నిర్మాతలు హీరోలకు దర్శకులకు కానుకలు ఇవ్వడం ఈ మధ్యకాలంలో ట్రెండ్ అవుతుంది. తాజాగా విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మకు 70 లక్షల విలువ చేసే బెంజ్ కార్ కానుకగా ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా సినిమా మంచి సక్సెస్ సాధించి మంచి లాభాలను అందుకుంటే తప్పకుండా దర్శకులకు కానుకలు ఇస్తూ సర్ప్రైజ్ చేస్తుంటారు.

కానీ కమల్ హాసన్ మాత్రం సినిమా విడుదల కాకముందే సినిమాలో కొన్ని సన్నివేశాలను చూసి ఎంతో కాన్ఫిడెన్స్ తో సినిమా హిట్ అవుతుందని ముందుగానే భావించి డైరెక్టర్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే కమల్ హాసన్ ఇలా దర్శకులకు కానుకలు ఇవ్వడం ఇది మొదటిసారి కాదు. వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్నటువంటి కమల్ హాసన్ కు విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాని అందించిన లోకేష్ కనగరాజ్ కి ఖరీదైన కారును బహుమానంగా ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.

అయితే తాజాగా ఈయన డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు సినిమాకి సీక్వెల్ చిత్రంలో ఎంతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా విడుదలకు చాలా సమయం ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను చూసిన కమల్ హాసన్ చాలా అద్భుతంగా వచ్చాయని సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారట.

ఈ క్రమంలోనే కమల్ హాసన్ (Kamal Haasan)  డైరెక్టర్ శంకర్ కి ఖరీదైన చేతి వాచీని కానుకగా ఇచ్చారని తెలుస్తోంది. ఈయన డైరెక్టర్ కు గిఫ్ట్ చేసిన ఈ వాచ్ ఫనేరాయ్ ల్యూమినార్ బ్రాండ్ కు చెందిన వాచ్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ వాచ్ ఖరీదు రూ.8.77 లక్షల రూపాయలు అని తెలుస్తుంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus