ప్రత్యేక పాత్రలో ‘లోకనాయకుడు’

ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ పుణ్యమా అంటూ తెరపై నవరసాలను పండించడమే కాకుండా, అద్భుతాలను సృష్టిస్తునారు మన యువ దర్శకులు. ఒకప్పుడు కుటుంభకధా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా ఉన్న సినీ పరిశ్రమ, ఆ తరువాత ఫ్యాక్షన్ కధల నేపధ్యంతో ఒక ఊపు ఊపింది. అయితే ఇప్పుడు ట్రెండ్ మొత్తం దెయ్యాల కధలపై నడుస్తుంది. ఇక అదే క్రమంలో దెయ్యాల కామెడీ సినిమాలు తెగ తెరకెక్కుతున్నాయి. అందులోనూ బడా హీరోలు కూడా ఈ సినిమాలను చేసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడంతో సరికొత్త కధలు, థ్రిల్ చేయడానికి, ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్దం అయిపోతున్నాయి. ఇక విషయం లోకి వెళితే…లోకనాయకుడు కమల్ హసన్ సైతం ఒక దెయ్యం సినిమాలో నటించేందుకు సిద్దం అవుతున్నట్లు తమిళ తంబీలు చెబుతున్నారు.

కాకపోతే ఇది కేమియో మాత్రమే అని తెలుస్తుంది. ఇంతకీ ఈ సినిమా వివరాలు ఏంటి అంటే…’మీంకుజాంబం మన్ పానయుం’ అనే తమిళ్ మూవీలో కమల్ హసన్ ‘దెయ్యాల మాంత్రికుడిగా’ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. పాత్ర కాస్త చిన్నది అయినప్పటికీ సినిమాను మలుపు తిప్పే పాత్ర అని ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న వాదన. ఒక శరీరంలో నుంచి ఆత్మను మరో శరీరంలోకి పరస్పరం మార్చే కేరక్టర్ ఇది. ఆత్మలను బంధించగలిగే శక్తి వంతుడుగా.. వాటి విద్యలు తెలిసిన మేథావిగా.. ఈ మూవీలో కమల్ పాత్ర స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని చిత్ర  యూనిట్ భావిస్తుంది.

ఇక అముదీశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని విశ్వ నటుడు శివాజీ గణేశన్ మనవడు దుష్యంత్ రామ్ కుమార్, ఆయన భార్య నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా హిట్ అయితే ఇలాంటి పాత్రలు మరిన్ని తెరపై ఆవిష్కృతం అవుతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus