Kamal-Rajini: రజినీకి భారీ రెమ్యునరేషన్.. కానీ కమల్ ‘స్మార్ట్’ కండిషన్!

కోలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద కాంబినేషన్లలో ఒకటైన కమల్ హాసన్, రజినీకాంత్ కలయికలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడం ఫ్యాన్స్‌కు పెద్ద పండగలాంటి వార్త. అయితే, ఈ ప్రాజెక్ట్‌లో కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, సుందర్ సి దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటించనున్నారు. ‘విక్రమ్’, ‘అమరన్’ హిట్ల తర్వాత ప్రొడక్షన్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న కమల్, ఈ సినిమాను సౌత్ ఇండస్ట్రీలోనే అత్యంత కాస్ట్లీ ప్రాజెక్ట్‌గా నిర్మించడానికి సిద్ధమయ్యారు.

Kamal-Rajini

ఈ సినిమా బడ్జెట్ విషయంలోనూ, రెమ్యునరేషన్ల విషయంలోనూ ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ నడుస్తోంది. స్నేహితుడి సినిమా కదా అని రజినీకాంత్ ఏమీ ఫ్రీగా చేయడం లేదు. ఈ సినిమా కోసం తలైవా తన కెరీర్‌లోనే అత్యంత భారీ రెమ్యునరేషన్‌ను అందుకుంటున్నారని కోలీవుడ్ వర్గాల్లో గట్టిగా టాక్ నడుస్తోంది. కమల్ హాసన్ కూడా తన స్నేహితుడి స్టార్‌డమ్‌కు, గ్లోబల్ మార్కెట్‌కు తగ్గట్టే మంచి అమౌంట్ ను చెల్లించడానికి వెనకాడటం లేదని సమాచారం. ఇదంతా చూసి, కమల్ స్నేహం కోసం ఇంత రిస్క్ చేస్తున్నాడేమో అని అందరూ అనుకున్నారు.

కానీ, ఇక్కడే కమల్ హాసన్ ఒక ‘స్మార్ట్’ బిజినెస్ కండిషన్ పెట్టారట. ఈ సినిమాకు రజినీకాంత్‌కు లాభాల్లో ఎలాంటి వాటా ఉండదట. రజినీ కేవలం తన భారీ రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటారట. సినిమాకు వచ్చే లాభాలన్నీ 100% నిర్మాతగా కమల్ హాసన్ మాత్రమే తీసుకోనున్నారు. స్నేహం వేరు, వ్యాపారం వేరు అన్నట్లుగా కమల్ ఈ డీల్‌ను పక్కాగా ప్లాన్ చేసుకున్నారని విశ్లేషకులు అంటున్నారు.

‘విక్రమ్’తో భారీ లాభాలు చూసిన కమల్, ప్రొడక్షన్‌లో చాలా స్ట్రాటజిక్‌గా ఆలోచిస్తున్నారు. రజినీకాంత్ బ్రాండ్ వాల్యూకు భారీ ఓపెనింగ్స్ రావడం గ్యారెంటీ. అందుకే, ఆ ఓపెనింగ్స్‌కు తగ్గట్టు భారీ రెమ్యునరేషన్ ఇచ్చేసి, ఆ తర్వాత వచ్చే లాభాలన్నింటినీ తన ఖాతాలోనే వేసుకోవాలన్నది ఆయన ప్లాన్. ఈ భారీ బడ్జెట్ చిత్రం 2026లో సెట్స్‌పైకి వెళ్లనుంది.

ఏదేమైనా, ఈ ఇద్దరు దిగ్గజాల కలయికలో వస్తున్న సినిమా కాబట్టి, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేందుకే కమల్ ఇంత భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఈ సినిమాను 2027 సంక్రాంతికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus