యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ చిత్రం జూన్ 3న విడుదల కాబోతుంది. ‘ఖైదీ’ ‘మాస్టర్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన లోకేష్ కనగరాజన్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా ‘రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్’ పతాకం పై స్వయంగా కమల్ హాసన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. విజయ్‌సేతుపతి, ఫాహద్ ఫాజిల్ వంటి స్టార్ హీరోలు కూడా ఈ మూవీలో నటిస్తుండగా సూర్య కూడా ఓ కీలక పాత్రలో పోషించారు.
అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.టీజర్, ట్రైలర్లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల కాబోతుంది ఈ మూవీ. ఇదిలా ఉండగా.. తాజాగా కమల్ హాసన్ తన అభిమానులకి క్షమాపణలు చెబుతూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా కమల్ హాసన్, లోకేష్ కనగరాజన్ ‘విక్రమ్’ ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ…
“నా గత చిత్రం విడుదలై నాలుగేళ్లు అయ్యింది. అందుకు నా అభిమానులకు క్షమాపణలు తెలుపుకుంటున్నాను. నేను సంపాదించింది తిరిగి చిత్ర పరిశ్రమలోనే పెడుతున్నాను, ఇకపై ప్రజల కోసం కూడా పెట్టుబడి పెడతాను. కరుణానిధి జయంతి అయిన 3వ తేదీన ‘విక్రమ్’ చిత్రం రిలీజ్ అవ్వడం యాదృచ్ఛికం. కానీ ఆయన నాకు ఇష్టమైన నాయకుడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విక్రమ్ సీక్వెల్ చేయడానికి కూడా నేను సిద్ధం” అంటూ కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.
కమల్ హాసన్ నటించిన గత చిత్రం ‘విశ్వరూపం2’ 2018 లో విడుదల అయ్యింది. తర్వాత ఆయన శంకర్ దర్శకత్వంలో ‘ఇండియా2’ చిత్రాన్ని మొదలుపెట్టారు కానీ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది.
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!