Kamna Jethmalani: ఒకప్పటి హీరోయిన్ కామ్నా జెఠ్మలానీ ఇప్పుడు ఎలా ఉందో చూడండి!

టాలీవుడ్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి క్రేజీ హీరోయిన్ గా ఎదిగిన ముంబై బ్యూటీ కామ్నా జెఠ్మలానీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘ప్రేమికులు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఆ తర్వాత గోపీచంద్ సరసన నటించిన ‘రణం’ చిత్రం హిట్ అవ్వడంతో ఈమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. ‘బెండుఅప్పారావ్ R.M.P’, ‘కత్తి కాంతారావ్’ ‘రణం’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. అయితే సరైన కథలు ఎంపిక చేసుకోవడంలో విఫలమవడంతో తొందరగానే ఫేడౌట్ అయిపోయింది.

‘సామాన్యుడు’ ‘బెండప్పారావు ఆర్.ఎం.పి’ ‘కత్తి కాంతారావు’ వంటి హిట్లు కొట్టినా ఈమె ఫామ్లోకి రాలేకపోయింది. అయితే ఈమె 2014 లో సూరజ్ నాగ్పాల్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయినట్లు అంతా చెబుతారు. కానీ వాస్తవానికి ఈమెకు ముందే పెళ్లయిందని, ఆఫర్ల కోసం ఆ విషయాన్ని దాచిందని మరి కొందరు చెబుతుంటారు. వాటిలో నిజం ఎంతుందో తెలీదు కానీ ఈమెకు పెళ్ళై,ఇద్డరు పిల్లలు కూడా ఉన్నారు అనేది మాత్రం వాస్తవం.

కామ్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈమె లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 4 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె ఏ పోస్ట్ పెట్టినా వెంటనే వైరల్ అయిపోతుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని ఇప్పుడు వైరల్ గా మారాయి.కానీ అందులో ఈమె గుర్తుపట్టలేని విధంగా ఉంది. కొంచెం ఏజ్డ్ ఫేస్ లా కనిపిస్తుంది అని చెప్పొచ్చు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus