Kamna Jethmalani: పుకార్లకు చెక్ పెట్టిన మాజీ హీరోయిన్ కామ్నా జఠ్మలానీ ..!

కామ్న జఠ్మలానీ 2006 ఆ టైములో తన గ్లామర్ తో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన హీరోయినే..! కాబట్టి అందరికీ ఈమె గుర్తుండే ఉంటుంది. ‘ప్రేమికులు’ ‘రణం’ ‘సామాన్యుడు’ ‘బెండు అప్పారావు ఆర్.ఎం.పి’ ‘కత్తి కాంతారావు’ వంటి చిత్రాల్లో నటించింది.తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం సినిమాల్లో కూడా నటించింది. కొన్నాళ్ళ తర్వాత ఈమెకు అవకాశాలు తగ్గాయి. అయితే ఈమె సినిమాల్లో నటిస్తూ ఉండగానే సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది అనే వార్తలు వచ్చేవి. పెళ్ళైన విషయాన్ని బయట పెడితే అవకాశాలు రావేమో అని భావించి…

బెంగళూరులో కాపురం పెట్టి, హైదరాబాద్ కు షూటింగ్స్ వచ్చేదని అప్పట్లో ప్రచారం జరిగింది. అలా ప్రయత్నించినా ఈమెకు అవకాశాలు తగ్గిపోతూనే వచ్చాయి. ఇదిలా ఉండగా.. ఇన్నాళ్టికి ఈ అమ్మడు తన సీక్రెట్ మ్యారేజ్ గురించి స్పందించింది. ‘సినిమా ఆఫర్లక .. నా పెళ్ళికి సంబంధం లేదు.పెళ్లి చేసుకున్నప్పటికీ సినిమాల్లో నటిస్తానని ముందే క్లారిటీ ఇచ్చాను.నా భర్తకు కూడా ఈ విషయంలో అభ్యంతరం లేదు. నాకు పెళ్ళైన విషయాన్ని నేను ప్రత్యేకంగా సీక్రెట్ గా ఉంచలేదు, ఇండస్ట్రీలో చాలామందికి ఆ విషయం తెలుసు.

అయితే నా పెళ్లికి ఎవ్వర్నీ ఆహ్వానించలేదు, కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరిగింది.అలా అని నాది లవ్ మ్యారేజ్ అనుకుంటున్నారేమో , నాది పెద్దలు కుదిర్చిన పెళ్లే. నా భర్త బెంగళూరుకు చెందిన ఓ బిజినెస్మెన్. ఇప్పటికైనా నాకు సినిమా ఆఫర్లు వస్తే నటిస్తాను, నా భర్త కూడా ఇందుకు ఓకే చెప్పారు.నాకు ఐటెం సాంగ్స్, స్పెషల్ సాంగ్స్.. కూడా చేయాలని ఉంది.’జనతా గ్యారేజ్’ లో కాజల్ చేసిన పక్కా లోకల్.. వంటి మసాలా సాంగ్ చేయాలని ఉంది.నాకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ నేను ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది కామ్న జఠ్మలానీ.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40


Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus