కంచె చిత్రానికి జాతీయ పురస్కారం

అటు విలువలను ఇటు కమర్షియల్ అంశాలను బాలన్స్ చేసుకుంటూ మంచి చిత్రాలను తీయాలి అనే తపన ఉన్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. అయన దర్శకత్వం లోమెగా హీరో వరుణ్ తేజ్, ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్య జైస్వాల్ జంటగా నటించిన చిత్రం ‘కంచె ‘. ఈ చిత్రానికి నేడు ప్రాంతీయ చిత్రాల విభాగం లో ఉత్తమ తెలుగు చిత్రం గా జాతీయ పురస్కారం దక్కింది.
ఈ పురస్కారం అనదుకోవటం పట్ల చిత్ర బృందం ఆనందాన్ని వ్యక్తపరిచింది. “ఎంతో ప్రేమ తో రూపొందించుకున్న కంచె చిత్రానికి ఈ గౌరవం రావటం నిజం గా చాలా ఆనందాన్ని ఇస్తోంది. తెలుగు జాతి కీర్తి ని చాటి చెప్పే నా తదుపరి చిత్రం మరికొద్ది రోజులలో మొదలు కాబోతోన్న సమయం లో, ఈ పురస్కారం రావటం ఒక మంచి పరిణామం గా భావిస్తున్నాను. ఈ జాతీయ పురస్కారం మా చిత్ర బృందం సమష్టి కృషికి ఒక గుర్తింపు అని అనుకుంటున్నాను. నా మీద ఉన్న బాధ్యత మరింత పెరిగింది”, అని క్రిష్ అన్నారు.
“ఒక మంచి చిత్రాన్ని తీసినందుకు తెలుగు ప్రేక్షకులు మా ‘కంచె’ ని బాగా ఆదరించారు. ఇప్పుడు ఈ అరుదైన గౌరవం మా కంచె బృందానికి ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఈ చిత్రం లో అధ్బుతం గా నటించిన వరుణ్ తేజ్ కు, ప్రగ్యా కు, అద్భుతమైన పాటలు అందించిన సీతారామ శాస్త్రి గారి కి, డైలాగ్స్ రాసిన సాయి మాధవ్ గారికి, మంచి సంగీతాన్ని ఇచ్చిన చిరంతాన్ భట్ కు, మా కెమరామెన్ బాబా కు మరియు మా సాంకేతిక నిపుణులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాము”, అని నిర్మాతలు రాజీవ్ రెడ్డి మరియు సాయి బాబు జాగర్లమూడి తెలిపారు.
కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కూడా ఉండొచ్చు. రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యం లో సాగే ఒక ప్రేమ కథ ఆధారం గా ‘కంచె’ చిత్రాన్ని నిర్మించారు . నిజమైన వరల్డ్ వార్ 2 గన్స్ , ట్యాంక్స తో జార్జియా లో భారి వ్యయం తో చిత్రీకరించిన వార్ ఎపిసోడ్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. రాజీవ్ రెడ్డి మరియు జాగర్లమూడి సాయి బాబు ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus