తాప్సి పై షాకింగ్ కామెంట్స్ చేసిన కంగనా రనౌత్..!

  • July 20, 2020 / 08:07 PM IST

కంగనా రనౌత్.. ఈమె బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో.. వివాదాలకే ఈమె పెద్ద పీట వేస్తుందా? అనేంతలా నోరు జారుతూ వస్తుంది. అక్కడి స్టార్ హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు కూడా ‘ఈమెతో పెట్టుకోవడం ఎందుకులే’ అన్నంతలా భయపడుతున్నారు. గతేడాది ఓ సినిమా ప్రమోషన్లో.. ఓ జర్నలిస్ట్ ను సైతం ఈమె టార్గెట్ చేసి విమర్శలు గుప్పించిన సంగతి ఎవ్వరూ మరిచిపోలేరు.

సరే ఇదంతా పక్కన పెట్టేసి అసలు విషయానికి వస్తే.. ఇటీవల కంగనా నెపోటిజం గురించి చేసిన కామెంట్స్ పెద్ద వైరల్ అయ్యాయి. ఇక అటు తరువాత హీరోయిన్ తాప్సి.. తనను కాపీ కొడుతుందని కూడా ఈమె చురకలు అంటించింది. ‘తాప్సి, స్వ‌ర భాస్క‌ర్ వంటి నటీమణులు ఎంతో ప్ర‌తిభావంతులయిన వారని .. కానీ బాలీవుడ్ మాఫియాకు వాళ్ళు భజన చెయ్యడం వల్లనే బి-గ్రేడ్ హీరోయిన్లుగా మిగిలిపోయార‌ని’ కామెంట్స్ చేసింది కంగనా.

అక్కడితో ఆగలేదు నెపోటిజం బ్యాచ్‌కు తాప్సి, స్వర భాస్కర్ లు స‌పోర్ట్ చేస్తార‌ని.. వీళ్ల కారణంగానే నెపోటిజం ఇంకా పెరుగుతుందని’ కంగనా చెప్పుకొచ్చింది. ఈమె కామెంట్స్ కు తాప్సి స్పందిస్తూ.. ‘ 10, 12 త‌ర‌గ‌తుల వరకూ మాత్రమే గ్రేడ్‌లు ఇస్తారని నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా గ్రేడింగ్స్ ఇస్తున్నారా? నేను ఎప్పుడూ క‌ర‌ణ్ జోహార్ ను స‌పోర్ట్ చేస్తూ మాట్లాడలేదు. అలా అని తిట్టాల్సిన పరిస్థితి కూడా నాకు రాలేదు’ అంటూ కంగనాకు ఘాటుగా సమాధానమిచ్చింది.

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus