కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. దీంతో చాలా రాష్ట్రాలలో థియేటర్లను బంద్ చేస్తున్నారు. జనాలు థియేటర్లకు రావడానికి భయపడుతుండడంతో సినిమా రిలీజ్ లను వాయిదా వేసుకోక తప్పడం లేదు. ఇప్పటికే చాలా సినిమాలను వాయిదా వేశారు. ఇందులో కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేయడానికి మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలో కంగనా నటించిన ‘తలైవి’ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి.
నిజానికి ఈ సినిమా ఈ నెల 23న విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో ఈ సినిమా ఓటీటీలో రాబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ విషయంపై చిత్ర నిర్మాతలు స్పందించారు. సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తామని.. కానీ ముందుగా థియేటర్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అంటే సినిమా ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ కాదన్నమాట. ఇలాంటి వార్తలు కావాలనే క్రియేట్ చేస్తున్నారని..
దీనికి కారణం సినిమా మాఫియా అని, ఇలాంటి రూమర్లను నమ్మొద్దు అంటూ కంగనా చెప్పుకొచ్చింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇందులో కంగనా టైటిల్ రోల్ పోషిస్తుండగా.. ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామీ కనిపించనున్నారు. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి విజయేంద్రప్రసాద్ కథ అందించారు.
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!