సూర్య (Suriya) హీరోగా ‘సిరుతై’ శివ (Siva) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కంగువా(Kanguva) . దిశ పఠాని (Disha Patani) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్… వంటివి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. దీంతో అంచనాలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో కంగువాకి బిజినెస్ చాలా బాగా జరిగింది. నైజాంలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేస్తుంది.
Kanguva
ఆంధ్ర లో యూవీ సంస్థ రిలీజ్ చేస్తుంది. ట్రేడ్ లో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో ఒకసారి చూడండి:
‘కంగువా’ చిత్రానికి రూ.13 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.14 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి. కానీ టార్గెట్ చాలా పెద్దది. టాక్ బాగుంటేనే ఓపెనింగ్స్ స్టెడీగా వస్తాయి. లేదు అంటే బ్రేక్ ఈవెన్ కష్టమే అని చెప్పాలి.